ఐపీఎల్ 2025 సీజన్ జోరుగా సాగుతుంది. ఇప్పటివరకు 41 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇప్పటికీ ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగానే ఉంది. ఈనేపథ్యంలో ఇవాళ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడుతోంది. ఈ మ్యాచులో టాస్ నెగ్గిన రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచులో రాజస్థాన్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. అటు ఎలాంటి మార్పుల్లేకుండా ఆర్సీబీ ఆడుతోంది.
ప్లేఆఫ్స్ చేరాలంటే రాయల్స్‌కి ఈ మ్యాచ్ కీలకం కాగా ప్రత్యర్థి గడ్డపై దుమ్మురేపుతూ వరుసగా ఐదు గెలుపులు నమోదు చేసిన ఆర్సీబీ, సొంతగడ్డ అయిన చిన్నస్వామి స్టేడియంలో మాత్రం తడబడుతోంది. ఇప్పటి వరకు ఆ స్టేడియంలో ఆడిన 3 మ్యాచుల్లోనూ ఓటమిపాలై అభిమానుల్లో నిరాశలో నిపింది. ఇక ఇవాళ్టి కీలక పోరులో గెలవాలని RCB భావిస్తోంది.

ఓవరాల్‌గా బెంగళూరుదే పైచేయి
ఆర్సీబీ, రాజస్థాన్ జట్ల మధ్య ఇప్పటివరకు 30 మ్యాచ్‌లు జరిగాయి. అందులో ఆర్సీబీ 16 మ్యాచ్‌లలో విజయం సాధించింది. మరో 14 మ్యాచ్‌లలో రాజస్థాన్ గెలుపొందింది. ఈ రెండు జట్ల మధ్య చివరగా జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించింది. ఈ సీజన్‌లో రాజస్థాన్‌తో జరిగిన మ్యాచులో బెంగళూరు 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.
తుది జట్లు ఇవే..
Rajasthan Royals: యశస్వీ జైస్వాల్, శుభమ్ దూబే, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (C), ధ్రువ్ జురెల్ (Wk), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, ఫజల్‌హాక్ ఫరూకీ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ
Royal Challengers Bengaluru: ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్(C), దేవదత్ పడిక్కల్, జితేష్ శర్మ(Wk), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్
Riyan Parag has won the toss and elected to bowl first against RCB.
Here are the playing XIs of both the sides 🏏#IPL #IPL2025 #RCBvsRR #RoyalChallengersBengaluru #RajasthanRoyals pic.twitter.com/9NdhiLMDB3
— XtraTime (@xtratimeindia) April 24, 2025






