
రోజురోజుకీ అందనంత ఎత్తుకు ఎగసిన పసిడి రేటు(Gold Price) కాస్త శాంతించింది. గత వారం రికార్డు ధరల(Record Rates)ను నమోదు చేసిన పుత్తడి ధరలు గత 5 రోజులుగా సామాన్యులకు ఊరట కల్పిస్తున్నాయి. దీంతో శుభకార్యాల సీజన్ కావడం, ఇటీవల ధరలు రూ.లక్ష దాడటంతో మున్నుందు పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళనల నడుమ జనం జ్యువెలరీ దుకాణాల(Jewellery Shops)కు పరుగులు పెడుతున్నారు. ఇవాళ (ఏప్రిల్ 26) బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్లు, 24 క్యారెట్ల పది గ్రాములు బంగారంపై స్వల్పంగా రూ. 30 మేర తగ్గింది. మరి ఇవాళ తులం ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇవాళ ధరలు ఎలా ఉన్నాయంటే..
కాగా శనివారం హైదరాబాద్(HYD)లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.90,020గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,210 వద్ద ట్రేడవుతోంది. అటు ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, అమరావతిలోనూ దాదాపు ఇవే ధరలు ఉన్నాయి. ఇక కేజీ సిల్వర్(Silver Price) ధర రూ.1,10,900వద్ద కొనసాగుతోంది. ఇక ఒక అమెరికన్ డాలర్‌కు రూపాయి విలువ(Rupee Value Today) రూ. 85.04గా ఉంది.