డార్లింగ్ ఫ్యాన్స్​కు పండగే.. ‘బాహుబలి -2’ రీ రిలీజ్​ ఫిక్స్

టాలీవుడ్ లో ఈ మధ్య రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఇందులో భాగంగా తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) సినిమా కూడా రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. బాహుబలి పార్ట్-2ను రీ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. బాహుబలి : ది కంక్లూజన్ (Bahubali : The Conclusion) విడుదలై ఎనిమిదేళ్లు పూర్తైన నేపథ్యంలో ఈ సినిమా రీ రిలీజ్​పై నిర్మాత శోభూ యార్లగడ్డ కీలక ప్రకటన చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Shobu Yarlagadda (@shobuy_)

బాహుబలి-2 రీ రిలీజ్

ఈ ఏడాది అక్టోబర్​లో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత శోభూ (Shobu Yarlagadda) వెల్లడించారు. “ఈ స్పెషల్ డే రోజున ఈ విషయాన్ని మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. బాహుబలి మూవీ భారత్​తో పాటు ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్​లో రీ రిలీజ్​ చేయాలని అనుకుంటున్నాం. ఇంకా కొన్ని సర్​ప్రైజ్​లు కూడా ఉన్నాయి.” అని నిర్మాత శోభూ యార్లగడ్డ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

ఆల్ టైమ్ రికార్డు

ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించారు. తొలి భాగం 2015లో విడుదల కాగా.. రెండో పార్ట్ 2017 ఏప్రిల్​ 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. రూ. 250 కోట్ల బడ్జెట్​తో రూపొందించిన ఈ చిత్రం ఆ సమయంలో దాదాపు రూ.1,800 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటి వరకూ అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా బాహుబలి కొనసాగుతుంది. ఇందులో అనుష్క, రానా, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటించారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *