Supreme Court: కొత్త సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు(Supreme Court)కు నూతన ప్రధాన న్యాయమూర్తి (CJI) రాబోతున్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా(CJI Justice Sanjiv Khanna) పదవీ విరమణ నేపథ్యంలో, జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ (BR Gavai) తదుపరి సీజేఐగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Draupadi Murmu) ఆమోదముద్ర వేశారు.

మే 14న బాధ్యతల స్వీకరణ

ప్రస్తుతం సీజేఐగా ఉన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 13న పదవీ విరమణ(Retirement) చేయనున్నారు. అనంతరం, మే 14వ తేదీన జస్టిస్ బీఆర్ గవాయ్(Justice BR Gavai) భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం(Oath) చేస్తారు. ఈ నియామక విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్(Arjun Ram Meghwal) అధికారికంగా ప్రకటించారు. అయితే, జస్టిస్ గవాయ్ CJIగా సుమారు 6 నెలల పాటు మాత్రమే సేవలందించనున్నారు. జస్టిస్ గవాయ్ నేపథ్యం పరిశీలిస్తే, ఆయన 1960 నవంబర్ 24న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు.

2003లో న్యాయ ప్రస్థానం మొదలు..

జస్టిస్ గవాయ్ తన న్యాయ ప్రస్థానాన్ని 2003 నవంబర్ 14న బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ప్రారంభించారు. అనంతరం 2005 నవంబర్ 12న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందడానికి ముందు ఆయన బాంబే హైకోర్టులో ముంబై, నాగ్‌పూర్, ఔరంగాబాద్, పనాజీ ధర్మాసనాల్లో దాదాపు 15 ఏళ్లకు పైగా న్యాయమూర్తిగా సేవలందించారు.

Related Posts

Racist Attack on Indian Girl: భారత సంతతి బాలికపై ఐర్లాండ్‌లో అమానుష ఘటన

ఐర్లాండ్‌(Ireland)లో అత్యంత అమానుష రీతిలో జాత్యాహంకార దాడి(Racist attack) జరిగింది. ఇక్కడి వాటర్‌ఫోర్డ్‌లో ఆరేండ్ల భారతీయ సంతతి బాలిక(Indian origin Girl) తన ఇంటి ముందు ఆటుకుంటూ ఉండగా కొందరు అబ్బాయిలు సైకిళ్లపై వచ్చి దాడి జరిపారు. తిట్లకు దిగి, ఐర్లాండ్…

Nitish Kumar: వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలిస్తాం.. సీఎం కీలక ప్రకటన

అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) సమీపిస్తుండటంతో బిహార్(Bihar) సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా నిరుద్యోగులే టార్గెట్‌గా ప్రచారం చేపట్టారు. ఈ మేరకు యువతను ఆకట్టుకునేందుకు X వేదికగా కీలక ప్రకటన చేశారు. 2025-2030…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *