ఐపీఎల్(IPL 2025)లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్(CSK)తో జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) సూపర్ విక్టరీ సాధించింది. చివరి బంతి వరకూ నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచులో ఆర్సీబీ 2 పరుగుల తేడాతో బంపర్ విజయం సాధించింది. చెన్నై విజయానికి చివరి ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా 12 పరుగులు మాత్రమే చేసింది. అద్భుతంగా బౌలింగ్ చేసిన యశ్ దయాల్(Yash Dayal) ధోనీ(Dhoni) వికెట్ తీసి బెంగళూరుకు మరపురాని విజయాన్ని అందించాడు. ఈ విజయంతో RCB ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకోగా.. చెన్నై పాయింట్ల పట్టికలో చివరి స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.

మాత్రే సూపర్ ఇన్నింగ్స్‌తో చెలరేగినా..
బెంగళూరు నిర్దేశించిన 214 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నై ఓపెనర్లు మాత్రే, రషీద్ 4.3 ఓవర్లలోనే 51 పరుగులు అందించారు. ఈ క్రమంలో రషీద్ (14) ఔటైనా మరో ఎండ్‌లో యంగ్ ఓపెనర్ ఆయుశ్ మాత్రే (48 బంతుల్లో 94) సూపర్ ఇన్నింగ్స్‌తో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఇతడికి రవీంద్ర జడేజా (45 బంతుల్లో 77*) కూడా జతకట్టడంతో చెన్నై విజయం వైపు నడిచింది కానీ చివర్లో మాత్రే, సామ్ కరణ్ (5), బ్రెవిస్ (0), ధోనీ (12) వెంటవెంటనే వికెట్లు కోల్పోయి ఒత్తిడిలోకి వెళ్లింది. చివరి ఓవర్లో 15 పరుగులు చేయాల్సి ఉండగా 12 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఆర్సీబీ బౌలర్లలో ఎంగిడి 3, దయాల్, పాండ్య చెరో వికెట్ తీశారు.

చెన్నైపై షెఫర్డ్ ఊచకోత
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 213/5 భారీ స్కోరు సాధించింది. ఆర్సీబీ ఓపెనర్లు బెథెల్ (55), కోహ్లీ (62) పరుగులతో రాణించగా.. చివర్లో రొమారియో షెఫర్డ్ (14 బంతుల్లోనే 53) మెరుపులు మెరిపించడంతో ఆర్సీబీ భారీ స్కోరు సాధించింది. చెన్నై బౌలర్లలో పతిరణ 3, సామ్ కరన్, నూర్ అహ్మద్ చెరో వికెట్ తీశారు. మెరుపు బ్యాటింగ్‌తో అలరించిన రొమారియో షెఫర్డ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
A clash for the ages 👏
A finish that’ll be remembered for years🔥#RCB triumph in an absolute thriller as Yash Dayal holds off the mighty #CSK in a roaring Bengaluru night 💪Scorecard ▶ https://t.co/I4Eij3Zfwf#TATAIPL | #RCBvCSK | @RCBTweets pic.twitter.com/IDKvGd3wuP
— IndianPremierLeague (@IPL) May 3, 2025






