తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు(Telangana-Chhattisgarh border) బీజాపూర్ జిల్లా ఉసురు పోలీస్‌స్టేషన్ పరిధిలోని కర్రెగుట్ట(Karregutta) కేంద్రంగా జరిగిన ఆపరేషన్‌లో 31మంది మావోయిస్టులు(Maoists) మృతి చెందినట్లు సీఆర్పిఎఫ్ డీజీ జీపీ సింగ్(CRPF DG GP Singh), ఛత్తీస్‌గఢ్ డీజీపీ అరుణ్‌దేవ్ గౌతం(DGP Arundev Gautam) తెలిపారు. బుధవారం బీజాపూర్(Bijapur)లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆపరేషన్ జరిగిన 21 రోజుల్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారని, వీరిలో 16 మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్లు తెలిపారు.
‘करेगुट्टा पहाड़ी को नक्सलियों से मुक्त कराया गया’- CRPF DG GPSingh ने प्रेस कॉन्फ्रेंस दी जानकारी#Chhattisgarh #CRPF #ceasefire #IndiaPakistanWar #chhatisgarh #crpf #crpfnews #chhatisgarhnews #gpsingh #NaxalFreeBharat #NaxalFreecg | @crpfindia pic.twitter.com/gTw8NKIEkP
— TheSootr (@TheSootr) May 14, 2025
మావోయిస్టులపై రూ.1.72 కోట్ల రివార్డు
ఈ ఆపరేషన్‌లో మృతి చెందిన మావోయిస్టులపై రూ.1.72 కోట్ల రివార్డు(Reward) ఉందని పేర్కొన్నారు. 18 మంది జవాన్లు గాయపడినట్లు చెప్పారు. మృతి చెందిన మావోయిస్టుల్లో 20 మందిని గుర్తించామని, ఇంకా 11 మందిని గుర్తించాల్సి ఉందన్నారు. 31 మంది మావోయిస్టుల నుంచి 35 ఆయుధాల(Weapons)ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 21 నుంచి మే 11 వరకు కర్రెగుట్ట ఆపరేషన్(Operation Karregutta) నిర్వహించామన్నారు.






