HIT-3: త్వరలో ఓటీటీలోకి హిట్-3.. స్ట్రీమింగ్ అప్పటినుంచేనా?

నేచురల్ స్టార్ నాని(Nani) నటించిన ‘హిట్ 3: ది థర్డ్ కేస్(Hit 3: The Third Case)’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. శైలేష్ కొలను(Director Sailesh Kolanu) డైరెక్షన్‌లో మే 1న రిలీజైన ఈ క్రైమ్ థ్రిల్లర్ అన్ని ఏరియాల్లో కలెక్షన్లు కొల్లగొడతోంది. విడుదలైన తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ ఇప్పటి వరకూ రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. విడుదలైన రెండు వారాలు పూర్తయినా చాలా థియేటర్లలో హౌస్ ఫుల్ షోలు పడుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

HIT 3 OTT Release Date: Watch Nani's Action Thriller Online Soon | Nani's HIT  3 on OTT: Streaming Details, Release Date & Platform Inside | HIT 3 Movie OTT  Premiere: When &

ఓటీటీ రైట్స్ రూ.50 కోట్లు?

ఇక సినిమాను OTTలో ఎప్పుడు చూడొచ్చో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులో భాగంగా, తాజా సమాచారం ప్రకారం, హిట్ 3 సినిమా నెట్‌ఫ్లిక్స్(Netflix) ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోందట. ఇందుకోసం నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ.50 కోట్లు చెల్లించినట్టు సమాచారం. థియేటర్ రిలీజ్ తర్వాత ఐదు వారాల వ్యవధిలో ఓటీటీకి వస్తుందనే ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది.

ఈ లెక్కన చూస్తే, జూన్ తొలి లేదా రెండో వారంలో ‘HIT 3’ ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుంది. కాగా ఈ మూవీలో హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) నటించగా, సూర్య శ్రీనివాస్, రావు రమేష్, సముద్రఖని, నెపోలియన్, రవీంద్ర విజయ్, ప్రతీక్ బబ్బర్, టిస్కా చోప్రా తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *