భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ (IPL-2025) సీజన్‌ను BCCI ఇటీవల వాయిదా వేసిన సంగతి తెలిసిందే. చివరి మ్యాచ్ పంజాబ్‌లోని ధర్మశాలలో PBKS VS DC మధ్య జరిగింది. అదే సమయంలో పంజాబ్‌లో యుద్ధ సైరన్(War Siren) మోగడంతో మ్యాచ్‌ను మధ్యలోనే ఆపేశారు. అనంతరం BCCI కీలక నిర్ణయం తీసుకుంది. వారం రోజుల పాటు వాయిదా(Postpone) వేస్తున్నట్లు తెలిపింది. అయితే భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ(Ceasefire) అనంతరం మళ్లీ ఐపీఎల్ రీస్టార్ట్ తేదీల(IPL New Schedule)ను బీసీసీఐ అనౌన్స్ చేసింది.

6 ప్రాంతాల్లో మిగతా 17 మ్యాచ్‌లు
ఈ మేరకు ఈనెల 17 నుంచి మిగిలిన మ్యాచ్‌లను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. 6 ప్రాంతాల్లో మిగతా 17 మ్యాచ్‌లను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. అయితే భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం ఉండటంతో విదేశీ ఆటగాళ్లు(Foreign Players) తమ దేశానికి వెళ్లిపోయారు. ఇప్పుడు మ్యాచ్‌లు రీస్టార్ట్ అవుతున్నా వారు తిరిగి ఇండియా(India)కు రావడం కష్టమనే వార్తలు వినిపిస్తున్నాయి. వీరిలో కొందరు అంతర్జాతీయ మ్యాచ్‌ల కోసం వెళ్లిపోగా.. మరికొందరు గాయాలు, వ్యక్తిగత కారణాలతో తర్వాతి మ్యాచ్‌లకు దూరం కానున్నారు.
🚨 IPL TWEAK RULES TEMPORARILY. 🚨
– Temporary replacements cannot be retained for the next season.
– Replacements approved prior to the suspension will remain eligible for retention. pic.twitter.com/v82nqXZlvC
— Prashanth Mudhiraj (@p4prashanthh) May 14, 2025
ఫ్రాంచైజీలు ఇబ్బంది పడకుండా..
ఈ తరుణంలోనే ఫ్రాంచైజీలు ఇబ్బంది పడకుండా IPL కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ ఆటగాళ్లు అందుబాటులో లేకపోతే వారి ప్లేస్‌లో కొత్త వారిని టీమ్‌లోకి తీసుకోవచ్చని తెలిపింది. అయితే దానికీ కొన్ని కండీషన్లు(Conditions) పెట్టింది. ప్లేయర్ల రీ-ప్లేస్మెంట్(Re-placement)లు తాత్కాలికమేనని చెప్పింది. ఇప్పుడు రీప్లేస్ చేసే వారిని వచ్చే సీజన్‌కు రిటైన్ చేసుకోవడం కుదరదని క్లారిటీ ఇచ్చింది. టెంపరరీగా వివిధ టీమ్‌లలో చేరే ప్లేయర్లు వచ్చే ఏడాది అంటే 2026 IPL మినీ వేలంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని వెల్లడించింది. ఈ మేరకు BCCI ఫ్రాంఛైజీలకు తెలిపింది.






