టాలీవుడ్లో శివపుత్రుడు, అపరిచితుడు(Aparichitudu), మల్లన్న(Mallanna), నాన్న, ఐ వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న తమిళ్ స్టార్ హీరో విక్రమ్(Vikram).. ఇటీవల బాక్సాఫీస్(Box office) వద్ద వరుస పరాజయాలు చవిచూస్తున్నారు. ఈ మధ్య వచ్చిన తంగలాన్ భారీ డిజాస్టర్‌ను అందుకోగా ఆ తర్వాత వచ్చిన ‘వీర ధీర శూరన్’ సైతం అభిమానులను ఊహించిన రేంజ్లో అలరించలేకపోయింది. ఈ నేపథ్యంలో చియాన్ విక్రమ్‌కు ఓ భారీ ఆఫర్ వచ్చినట్లు టాలీవుడ్(Tollywood)లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ అదేంటంటే..
ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు
బాహుబలి ఫ్రాంచైజీ, RRR చిత్రాల తర్వాత ప్రపంచ ప్రఖ్యాత దర్శకుల జాబితాలో చేరారు రాజమౌళి(Director Rajamouli). ప్రస్తుతం ఆయన మహేశ్‌బాబు(Maheshbabu) హీరోగా తెరకెక్కిస్తున్న ‘SSMB29’పై ప్రపంచవ్యాప్తంగా అంచనాలున్నాయి. ఈ పాన్ ఇండియా మూవీలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్టులో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) కూడా భాగం కానున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి స్టోరీని కూడా విక్రమ్‌కి డైరెక్టర్ రాజమౌళి వినిపించారట.

అమేజాన్ అడవుల నేపథ్యంలో..
ఆయన కూడా రాజమౌళీ సినిమాలో నటించేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్టు తెలుస్తున్నది. అమేజాన్ అడవుల నేపథ్యంలో నిధి అన్వేషణే ప్రధానాంశంగా రూపొందనున్న ఈ సినిమాలో విక్రమ్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతున్నదని సమాచారం. కాగా ఈ మూవీని వచ్చే ఏడాది రిలీజ్(Release) చేసే అవకాశం ఉంది. ఇందులో నానా పటేకర్, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా(Priyanka Chopra) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దాదాపు రూ.1000కోట్ల వ్యయంతో డా. KL నారాయణ నిర్మిస్తున్నారు. కీరవాణి(Kiravani) మ్యూజిక్ అందిస్తున్నారు.







