
ఐపీఎల్ 18వ సీజన్ భారత్, పాక్ మధ్య ఘర్షణ వాతావరణం వల్ల అర్ధంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. దీంతో విదేశీ ప్లేయర్లు ఒక్కొక్కరుగా తమ దేశాలకు వెళ్లిపోయారు. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) కూడా ఆస్ట్రేలియాకు వెళ్లిపోయారు. ఇంతలోనే భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంలో ఐపీఎల్ ఈ నెల (మే 17) నుంచి స్టార్ట్ కావడానికి మార్గం సుగమమైంది. అయితే స్వదేశానికి వెళ్లిన క్రికెటర్లు తిరిగి రావడానికి పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు.
డబ్య్లూటీసీ ఫైనల్ వల్లే రాలేకపోతున్నా: స్టార్క్
ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ ఈ సీజన్లో 11 మ్యాచులు ఆడి 14 వికెట్లు తీశాడు. DCకి ప్రధాన పేసర్‌గా సేవలందిస్తున్నాడు. మూడు రోజుల పాటు ఢిల్లీ అతడి సమాధానం కోసం వేచి చూసింది. ఎప్పుడెప్పుడూ రిప్లై ఇస్తాడా అని చూస్తున్న DCకి మింగుడుపడని వార్తే చెప్పాడు. మిగిలిన IPL మ్యాచులకు తాను అందుబాటులో ఉండటం లేదని స్టార్క్ చెప్పేశాడు. జూన్‌లో ప్రపంచ టెస్ట్ చాంఫియన్ షిప్(WTC) ఫైనల్లో ఆస్ట్రేలియా తరఫున ప్రధాన బౌలర్‌గా మిచెల్ స్టార్క్ బరిలో దిగనున్నాడు. దీంతో మిగిలిన మ్యాచులకు రాలేనని ఢిల్లీ క్యాపిటల్స్ టీంకు మెయిల్ పంపించాడు.
Mitch Starc has decided against returning to the IPL after the tournament’s postponement: https://t.co/5p3zdSkD4E pic.twitter.com/cp6VPn7eVJ
— cricket.com.au (@cricketcomau) May 16, 2025
రూ.11.75 కోట్లకు కొనుగోలు
ఢిల్లీ ఫ్రాంఛైజీ రూ.11.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పటివరకు డీసీ తరపున సీజన్లో 11 మ్యాచ్‌లలో ఆడిన 35 ఏళ్ల పేసర్, 26 సగటుతో 14 వికెట్లు పడగొట్టాడు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ మరో ఆసీస్ ఓపెనర్ జేమ్స్ ఫ్రెజర్ మెక్ గుర్క్ (James Fraser McGurk) స్థానంలో బంగ్లా క్రికెటర్ ముస్తాఫిజర్ రెహమన్‌ను (Mustafizur Rahman) తీసుకుంది.