దేశంలోని ప్రతిష్ఠాత్మక 23 ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్(JEE Advanced 2025) ఈరోజు (మే 18) జరగనుంది. ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఐఐటీ కాన్పుర్(IIT Kanpur) అందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈమేరకు ఉదయం 9-12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30- 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరగనుంది. జేఈఈ మెయిన్(JEE Mains)లో కనీస స్కోర్ సాధించిన 2.50 లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్డ్ రాయడానికి అవకాశం ఇవ్వగా.. సుమారు 1.85 లక్షల మందే దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణలోని ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 40 వేల మంది హాజరవుతారని అంచనా. గతేడాది 1,80,200 మంది అడ్వాన్స్డ్ రాశారు. అడ్వాన్స్డ్లో ఉత్తీర్ణులైన వారు B.Arch కోర్సుల్లో చేరాలనుకుంటే ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు(AAT) రాయాల్సి ఉంటుంది. ఆ పరీక్ష జూన్ 5వ తేదీన నిర్వహిస్తారు. తెలంగాణలోని ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, మహబూబ్నగర్, నల్గొండ, కోదాడ, సూర్యాపేట, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్లో ఉన్నాయి.
ఏపీలో ఈ జిల్లాల్లో..
అటు ఏపీలోని శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, అమలాపురం, భీమవరం, ఏలూరు, కాకినాడ, రాజమహేంద్రవరం, సూరంపాలెం, తాడేపల్లిగూడెం, మైలవరం, విజయవాడ, గుడ్లవల్లేరు, గుంటూరు, నరసరావుపేట, ఒంగోలు, చీరాల, మార్కాపురం, గూడూరు, నెల్లూరు, అనంతపురం, కడప, కర్నూలు, తిరుపతి, చిత్తూరులో ఏర్పాటు చేశారు. కాగా నిమిషం ఆలస్యమైనా కేంద్రాల్లోకి ఎంట్రీ ఉండదని అధికారులు తెలిపారు. అటు పరీక్షా కేంద్రాలలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావొద్దని సూచించారు.






