
IPL 2025లో భాగంగా ఇవాళ జరిగిన తొలి మ్యాచులో రాజస్థాన్ రాయల్స్(RR)పై పంజాబ్ కింగ్స్(PBKS) 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ నెగ్గిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 219/5 భారీ స్కోరు సాధించింది. ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 209/7 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో పంజాబ్ 12 మ్యాచుల్లో 17 పాయింట్లతో పట్టికలో సెకండ్ ప్లేస్(Second Place)కు దూసుకెళ్లింది. అటు రాజస్థాన్ ఆడిన 13 మ్యాచుల్లో పదింట్లో ఓడి చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది.
అదరగొట్టిన వధేరా..
జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో టాస్ నెగ్గిన పంజాబ్(PBKS) తొలుత బ్యాటింగ్ చేసింది. నేహాల్ వధేరా (70), శశాంక్ సింగ్ (59) పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్‌తోపాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (30), అజ్మతుల్లా (21), ప్రభ్ సిమ్రన్ సింగ్ (21) పరుగులు చేయడంతో 219 పరుగులు సాధించింది. రాయల్స్(RR) బౌలర్లలో దేశ్ పాండే 2, మఫాకా, మధ్వాల్ చెరో వికెట్ తీశారు.
WHAT A SUPERB TEAM IS PBKS 🔥
Not good Start by Opener, 34/3 but Nehal Wadhera plays brilliant Knock & Shashank plays Impactful Innings. Top Bowling in death Overs by PBKS bowler.
Superb Captaincy by Shashank in absence of Shreyas Iyer ❤️ #RRvsPBKS pic.twitter.com/0dHOdPYKo5
— VIKAS (@VikasYadav69014) May 18, 2025
జైస్వాల్, ధ్రువ్, వైభవ్ పోరాడినా..
అనంతరం 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు ఓపెనర్లు జైస్వాల్ (50), వైభవ్ (40) మెరుపు ఆరంభాన్ని అందించారు. అయితే వీరిద్దరూ ఔటయ్యాక సంజూ శాంసన్(20), పరాగ్ (13), హెట్మయర్ (11) నిరాశపర్చారు. మిడిల్ ఆర్డర్లో ధ్రువ్ జురెల్ (53) మెరుపు ఇన్నింగ్స్ ఆడినా ఫలితం లేకపోయింది. దీంతో రాయల్స్ విజయానికి 11 పరుగుల దూరంలో నిలిచింది. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ 3 వికెట్లు తీయగా, జాన్సెన్, ఓమర్జాయ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
ఇదిలా ఉండగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో గుజరాత్ టైటాన్స్(DC vs GT) తలపడుతోంది. ఈ మ్యాచులో గుజరాత్ టైటాన్స్ టాస్(Toss) నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది.
🚨 Indian Premier League 2025, DC vs GT 🚨
TOSS#GTvDC #DCvsGT #GTvsDC #DCvGT #IPL2025 #TATAIPL2025 #TATAIPL #Delhi #DelhiCapitals #AavaDe #GujaratTitans pic.twitter.com/O2N9lxThtF
— Sporcaster (@Sporcaster) May 18, 2025