
రైతులకు వాతావరణ శాఖ(Department of Meteorology) శుభవార్త అందించింది. ఈ ఏడాది రుతుపవనాలు(Monsoons) అనుకున్న సమయానికంటే ముందుగానే వస్తాయని, అలాగే ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం(High rainfall) నమోదవుతుందని తెలిపింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు(Southwest monsoon) ఈనెల 24వ తేదీ వరకే కేరళను తాకే అవకాశాలున్నాయని అంచనా వేసింది. తొలుత మే 27 నాటికి వస్తాయని భావించినా.. పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో వాటి గమనంలో వేగం మారిందన్నారు. పదేళ్ల క్రితం 14 రోజుల ముందుగానే రుతుపవనాలు దేశమంతటా విస్తరించాయని, ఈసారి అంతకంటే వేగంగా కదులుతాయని పేర్కొంది. ప్రస్తుతం అండమాన్ నికోబార్(Andaman and Nicobar) దీవులంతటా విస్తరించి ఉన్నాయని తెలిపింది.
నాలుగు రోజుల పాటు వర్షాలు
తెలంగాణ(Telangana) ప్రజలకు వాతావరణ శాఖ మరో శుభవార్తను అందించింది. రాగల నాలుగు రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Centre) ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాగల నాలుగు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. కాగా ఆదివారం హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షం కురిసిన సంగతి తెలిసిందే.