Trump Tariffs : విదేశీ సినిమాలపై 100 శాతం టారిఫ్.. భారత్ కు కోలుకోని దెబ్బ తప్పదా!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) విదేశీ సినిమాలపై 100 శాతం టారిఫ్ (100 percent Tariffs) విధించాలని నిర్ణయం తీసుకోవడం భారతీయ సినిమా వర్గాల్లో కలవరం సృష్టిస్తోంది. విదేశీ సినిమాల(Indian movies) కారణంగా అమెరికన్ సినిమా పరిశ్రమ క్షీణిస్తోందని ట్రంప్ ఆరోపించారు. ఇతర దేశాల సినిమాలను ప్రోత్సహించడమే హాలీవుడ్ (Hollywood) ఆర్థికంగా దెబ్బతినడానికి కారణమని ట్రంప్ పేర్కొన్నారు. అందుకే 100 శాతం టారిఫ్‌ను ప్రకటించారు. ఇది కాస్త అమల్లోకి వస్తే, అమెరికాలో భారతీయ సినిమాల పంపిణీ ఖర్చు రెట్టింపు అవుతుంది.

ఓవర్సీస్ మార్కెట్ మనకు కీలకం..

భారతీయ సినిమాలకు అమెరికా ఓవర్సీస్ మార్కెట్‌ కీలకం. ఇక్కడ ప్రవాస భారతీయులు అధిక సంఖ్యలో ఉండటంతో పాటు, భారతీయ సినిమాలకు మంచి ఆదరణ ఉంది. ఈ టారిఫ్ కారణంగా టికెట్ ధరలు(ticket prices hike) పెరిగే అవకాశం ఉంది. ఇది థియేటర్లకు వచ్చే ప్రేక్షకులను తగ్గించవచ్చు. దీంతో భారతీయ సినిమాల ఓవర్సీస్ వసూళ్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. కొన్ని సినిమాలు థియేట్రికల్ విడుదలకు బదులుగా నేరుగా ఓటీటీ వేదికలపై విడుదల కావడానికి మొగ్గు చూపవచ్చని కూడా అంచనా వేస్తున్నారు.

అమెరికాలో టాప్ కలెక్షన్ మూవీస్..

ఇప్పటివరకు ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో ‘దంగల్’ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ‘సీక్రెట్ సూపర్ స్టార్’, ‘బజరంగీ భాయీజాన్’, ‘బాహుబలి 2 ది కన్‌క్లూజన్’, ‘RRR’, ‘పఠాన్’, ‘జవాన్’ వంటి సినిమాలు అత్యధిక వసూళ్లు రాబట్టాయి. 2024-2025 ఏడాదిలో ఓవర్సీస్‌లో మంచి వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో ‘పుష్ప 2 ది రూల్’, ‘కల్కి 2898 AD’ ముందు వరుసలో ఉన్నాయి. అలాగే, 2025లో విడుదలైన ‘చావా’, ‘L2 :ఎంపురాన్’, ‘రెట్రో’ వంటి చిత్రాలు కూడా ఓవర్సీస్‌లో చెప్పుకోదగ్గ వసూళ్లు రాబడుతున్నాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *