బాలీవుడ్ (Bollywood) ప్రముఖ గేయ రచయిత జావేద్ అక్తర్ (Javed akhtar) ఇటీవల ముంబైలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ (Sanjay Raut) రచించిన పుస్తకావిష్కరణ సందర్భంగా అక్తర్ మాట్లాడుతూ.. తనకు ఎదురవుతున్న విమర్శలు, దూషణలపై స్పందించారు.
రెండు దేశాల నుంచి తప్పని విమర్శలు..
జావేద్ అక్తర్ మాట్లాడుతూ.. ‘నన్ను చాలా మంది ప్రశంసిస్తారు, ప్రోత్సహిస్తారు. కొన్ని సార్లు అవి కాస్త రివర్స్ అవుతుంటాయి. భారతదేశం, పాకిస్తాన్‌లోని కొందరు అతివాదుల నుంచి నాకు నిరంతరం దూషణలు(Bad comments) వస్తాయి. ఒక వర్గం వారు నన్ను ‘కాఫిర్'(Kaffir) (అవిశ్వాసి) అని పిలుస్తూ నరకానికి వెళ్తావని దూషిస్తుంటారు. మరో వర్గం వారు నన్ను ‘జిహాదీ'(terroist) అని పిలుస్తూ పాకిస్తాన్‌కు వెళ్లిపోవాలని అంటారు’ అని వివరించారు.
పాక్ కంటే నరకమే బెటర్..
‘ఒకవేళ నాకు పాకిస్తాన్ (Pakistan) లేదా నరకం (Hell) అనే రెండే ప్రత్యామ్నాయాలు ఉంటే.. నేను నరకానికే వెళ్లడానికి ఇష్టపడతాను’ అని జావేద్ అక్తర్ వ్యాఖ్యానించారు. తను నిర్భయంగా అభిప్రాయాల వెల్లడించడం కారణంగా నిత్యం విమర్శలు ఎదుర్కొంటానని పేర్కొన్నారు. ఇదిలాఉండగా, ఆయన చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.






