మహేశ్ బాబు ఫ్యామిలీ నుంచి మరో హీరో.. కటౌట్ చూస్తే మతిపోవాల్సిందే!

టాలీవుడ్‌ (tollywood)లో సూపర్‌స్టార్‌ కృష్ణ (super star krishna) కుటుంబం నుంచి మరో వారసుడు సినీ రంగ ప్రవేశం చేయనున్నాడు. దివంగత నటుడు కృష్ణ పెద్ద కుమారుడు, దివంగత రమేశ్ బాబు (Ramesh babu) తనయుడు జయకృష్ణ (jaya krishna)త్వరలోనే హీరోగా పరిచయం కానున్నాడు. ఇందుకోసం ఇప్పటికే విదేశాల్లో నటనలో శిక్షణ తీసుకున్న జయకృష్ణ, ప్రస్తుతం పలు కథలు వింటున్నట్లు సమాచారం. సూపర్‌స్టార్ మహేశ్ బాబు (mahesh babu) మేనల్లుడు కావడంతో జయకృష్ణ ఎంట్రీపై తెలుగు చలన చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

RX100 దర్శకుడితో ఎంట్రీ

ఇన్నాళ్లు కథలు విన్న జయకృష్ణ ఓ స్టోరీని ఫైనల్ చేసినట్లు సమాచారం. తన డెబ్యూ మూవీని ఆర్ ఎక్స్-100 (RX100 Film) మూవీ దర్శకుడు అజయ్ భూపతి (Ajay bhoopathi) తెరకెక్కించనుండగా.. వైజయంతీ మూవీస్, ఆనంది ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, ఇప్పటికే జయకృష్ణ కటౌట్(cutouts viral) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Image

మహేశ్‌తో పాటే అతని సోదరులు, సోదరి..

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి సినీ పరిశ్రమలోకి చాలా మంది అడుగుపెట్టారు. కృష్ణ తన నట ప్రస్థానంలో సరికొత్త చరిత్ర సృష్టించగా, ఆయన తర్వాత కుమారుడు మహేశ్ బాబు సూపర్‌స్టార్‌గా ఒక వెలుగు వెలుగుతున్నారు. పెద్ద కుమారుడు రమేశ్ బాబు కొన్ని సినిమాల్లో హీరోగా చేసి ఆ తర్వాత నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. కృష్ణ కూతురు మంజుల నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా తనదైన ముద్ర వేసుకున్నారు.

Image

విజయ నిర్మల మనవడు సైతం..

వారితో పాటే కృష్ణ మరో కొడుకు గల్లా అశోక్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తున్నారు. విజయనిర్మల మనవడు, నరేష్ కుమారుడు శరణ్ కుమార్ కూడా సినీ రంగంలో కొనసాగుతున్నారు. వీరందరిలో కేవలం మహేశ్ బాబు మాత్రమే అత్యంత విజయవంతమైన నటుడిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు జయకృష్ణ కూడా ఈ పరంపరను కొనసాగించడానికి సిద్ధమవుతున్నాడు. బాబాయ్ మహేష్ బాబు వలె సినిమా పరిశ్రమలో తన ముద్ర వేయడానికి సిద్ధమయ్యాడు.

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *