‘విజయ్‌ దేవరకొండతో నటించాలని ఉంది’.. మిస్ శ్రీలంక కామెంట్స్ వైరల్  

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో విజయ్ దేవరకొండ (vijay devarakonda) గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర లేదు. ఇండస్ట్రీలోకి(Tollywood) వచ్చి చాలా కాలం అయినా..తనకంటూ హీరోగా మంచి గుర్తు రావడానికి ఆయన ఎంతో శ్రమించారు. వన్స్ క్రేజ్ వచ్చాక అతి తక్కువ కాలంలోనే  టాప్ హీరోల లిస్టులో చేరిపోయాడు. ప్రస్తుతం విజయ్ క్రేజ్.. దేశదేశాలకు వ్యాప్తిస్తోంది. మన పొరుగుదేశమైన శ్రీలంక(Sri lanka)లో కూడా విజయ్ దేవరకొండకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్  ఏర్పడింది.

ఆ చిత్రంతోనే విజయ్‌కు క్రేజ్..
విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ఇటీవల ‘మిస్ శ్రీలంక అనుది గుణశేఖర’ ఒక సందర్భంలో స్పందించారు. టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండతో కలిసి నటించాలనే తన కోరికను వ్యక్తం చేశారు. తాను విజయ్ దేవరకొండ నటనకు వీరాభిమాని అని తెలిపారు. దీంతో ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. విజయ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్  ఇంతగా ఉందని ఆయన అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా అర్జున్ రెడ్డి సినిమా శ్రీలంకలో బాగా ఆడిన విషయం తెలిసిందే. అందులో విజయ్ నటనకు అక్కడి అభిమానులు ఫిదా అయ్యారు.
మిస్ వరల్డ్ పోటీలకు వచ్చి.. 
ప్రస్తుతం మిస్ శ్రీలంక అనుది గుణశేఖర (Miss SriLanka Anudi Gunasekara) హైదరాబాద్‌లో ఉన్నారు. అందాల పోటీల్లో(miss World compitations) పాల్గొనేందుకు వచ్చిన ఆమె.. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తెలుగులో ఏ హీరోతో సినిమా చేయాలని అనుకుంటున్నారని యాంకర్ అడిగిన ప్రశ్నకు అనుది గుణశేఖర పై విధంగా స్పందించారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *