అన్నపూర్ణ స్టూడియోస్‌లో గుప్త నిధుల కోసం అన్వేషణ.. నాగ చైతన్య డేరింగ్ చూశారా?

టాలీవుడ్ యువ హీరో నాగచైతన్య ఈ ఏడాది తండేల్ చిత్రంతో భారీ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా, నాగచైతన్య కెరీర్‌లో అతిపెద్ద హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం నాగచైతన్య కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో మరో భారీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. వర్కింగ్ టైటిల్ NC 24గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Image

ఈ సినిమాలో కీలకమైన గుహ సన్నివేశాల కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా సెట్ వేశారు. ఈ గుహ సెట్ నిర్మాణానికి సుమారు రూ. 5 కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం. ఒక గుహ నుంచి మరో గుహకు కనెక్ట్ అయ్యే విధంగా, వేర్వేరు మెటీరియల్స్ ఉపయోగించి అత్యంత న్యాచురల్‌గా ఈ సెట్‌ను రూపొందించారు. ఈ గుహలో నిధి నిక్షేపాల కోసం వెతికే సీన్స్ చేస్తున్నారట చైతూ. దాదాపు 20 నిమిషాల పాటు గుహ నేపథ్యంలో సాగే సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయట.

ఇక ఈ చిత్రంలో నాగచైతన్యకు జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఓ అర్కియాలజిస్ట్ పాత్రలో ఆమె మెరవనున్నారు. మిస్టిక్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా, నాగ చైతన్యకు పూర్తి విభిన్నమైన పాత్రను అందించబోతోందని టాక్. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇకపై ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు సినిమాపై హైప్ తీసుకొచ్చేలా అప్ డేట్స్ వదలనున్నారట మేకర్స్.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *