ఒకరి తర్వాత మరొకరు.. ఏకంగా 25 మందితో మహిళ వివాహం.. ఆపై ట్విస్టులు!

ఆమె ఒక కి‘లేడీ’.. తన మధురమైన మాటలతో అమాయకపు మగవారి(mens cheated)ని తన బుట్టలో వేసుకుంటుంది. ప్రేమ పేరుతో (love and marriage) తన వలలో వేసుకుని పెళ్లి వరకు తీసుకెళ్తుంది. ఎవరికి తెలియకుండా పెళ్లికి మగవారిని ఒప్పించి గుట్టుగా వివాహం చేసుకుని కాపురం పెడుతుంది. వివాహం జరిగిన కొద్ది రోజుల వరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాతే ఆవిడ గారి నిజస్వరూపం బయట పడుతుంది. ఉన్నట్టుండి చెప్పకుండా ఇంట్లోని డబ్బులు, నగల(cash and gold)తో పరారవుతుంది.ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 25 మంది (25 members victims)ని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసిన మహిళను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు.

పక్కా పథకం ప్రకారమే..

రాజస్థాన్‌కు చెందిన అనురాధ పాసవాన్ (Rajastan women anuradha pasavan) అనే మహిళ.. వివాహం పేరుతో తనను మోసం చేసిందని బాధిత భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎట్టకేలకు ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో భాగంగా ఆమె లీలలు బయట పడటంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్లాన్ ప్రకారం పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే వరుడి ఇంట్లో ఉన్న డబ్బు, బంగారంతో ఉడాయించడం ఆమెకు హాబీగా మారిపోయిందని పోలీసులు గుర్తించారు.

అమాయక యువకులే టార్గెట్..

పోలీసుల కథనం ప్రకారం.. అనురాధ పలువురు అమాయక యువకులను లక్ష్యంగా చేసుకుంది. మొదట వారిని పెళ్లి చేసుకుని, నమ్మకం సంపాదించిన తర్వాత ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి డబ్బు, ఆభరణాలతో ఉడాయించేది. ఈమె మోసాలు రాజస్థాన్‌లోని వివిధ ప్రాంతాలలో జరిగాయి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనురాధ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు, సాంకేతిక ఆధారాలు, బాధితుల సమాచారం ఆధారంగా పోలీసులు అనురాధను అరెస్టు(Arrested) చేశారు. ఈమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా, వివాహాల పేరుతో జరిగే మోసాలపై అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *