అమెరికా(America)లోని పలు రాష్ట్రాలు టోర్నడో(Tornado)ల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తాజాగా సంభవించిన నాలుగు శక్తిమంతమైన టోర్నడోలు టెక్సాస్ నుంచి కెంటకీ(Texas to Kentucky) వరకు విస్తృత ప్రాంతంలో విధ్వంసం సృష్టించాయి. ఈ పెనుగాలుల ధాటికి అనేక భవనాలు(Buildings) కుప్పకూలగా, విద్యుత్ సరఫరా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. దీంతో అనేక నగరాలు, పట్టణాలు అంధకారంలో చిక్కుకున్నాయి.
చీకటిలోనే ప్రజలు
ఓక్లహామా(Oklahoma) రాష్ట్రంలో పరిస్థితి దయనీయంగా ఉంది. ఇక్కడ ఒక అగ్నిమాపక కేంద్రం(Fire station)తో పాటు కనీసం పది నివాస గృహాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఈ ప్రాంతాల్లో దాదాపు 1,15,000 మంది ప్రజలు విద్యుత్ సౌకర్యం లేక చీకటిలోనే గడపాల్సిన దుస్థితి నెలకొంది. టోర్నడోల ప్రభావంతో పలు జాతీయ రహదారులు కూడా దెబ్బతిన్నాయి.
వడగళ్ల వాన బీభత్సం
ఉత్తర టెక్సాస్(North Texas)లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఇక్కడ సుమారు 11.4 సెంటీమీటర్ల వ్యాసంతో కూడిన పెద్ద పెద్ద వడగళ్లు పడ్డాయని స్థానిక వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు. మరోవైపు, సెయింట్ లూయిస్ నగరంలో టోర్నడోల వల్ల కనీసం 5,000 భవనాలు దెబ్బతిన్నాయని, దీనివల్ల సుమారు 1 బిలియన్ డాలర్ల ఆస్తి నష్టం వాటిల్లిందని తెలుస్తోంది.
At 1027 PM EDT, a severe thunderstorm with a POSSIBLE TORNADO was located near Knoxville, moving east at 40 mph.
HAZARD…60 mph wind gusts and penny size hail.
SOURCE…Radar indicated.
IMPACT…Expect damage to roofs, siding, and trees.* Locations impacted include… Newport,… pic.twitter.com/dBaAaj6BB4
— Josh Farrow (@Chief_Weather) May 21, 2025








