తెలంగాణలోని నిరుద్యోగుల(Uunemployed in Telangana)కు శుభవార్త. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో వివిధ శాఖల్లో 27వేల ఉద్యోగాల(Jobs) భర్తీకి కసరత్తు మొదలు పెట్టింది. ఇప్పటికే వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలను తెప్పించుకున్న ప్రభుత్వం.. వాటిని ఫైనల్ చేసి ఫైనాన్స్ అప్రూవల్(Finance Approval) ఇవ్వనుంది. మరోవైపు.. ఇప్పటి వరకు Group 3, 4కు వేర్వేరుగా ఎగ్జామ్స్ నిర్వహిస్తుండగా.. ఇక నుంచి ఈ రెండింటికీ కలిపి ఒకే ఎగ్జామ్(Single Exma) పెట్టాలని ప్రభుత్వం(TG Govt) భావిస్తోంది. ఈ మేరకు కసరత్తు చేస్తోన్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే గ్రూప్ 3, 2 నోటిఫికేషన్లు..
గ్రూప్3, 4కు ఒకే సిలబస్, క్వాలిఫికేషన్ (Degree) ఉంది. కేవలం పోస్టింగ్(Posting) విషయంలోనే మార్పు ఉంది. గ్రూప్ 3 కింద రిక్రూట్ అయ్యే వాళ్లు HOD కార్యాలయాల్లో పోస్టింగ్ అవుతుండగా.. గ్రూప్ 4 కింద రిక్రూట్ అయ్యేవాళ్లు జిల్లా కార్యాలయాల్లో పోస్టింగ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో రెండింటికీ కలిపి ఒక్కటే పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ లోనే పోలీస్ పోస్టుల(Police Posts)కు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. మే చివర్లో Group-2 నోటిఫికేషన్, జులైలో గ్రూప్-3 నోటిఫికేషన్లు రానున్నట్లు తెలుస్తోంది.
జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్
అయితే, ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల నోటిఫికేషన్(Forest Beat Officers Notification) షెడ్యూల్ చేయగా SC వర్గీకరణ కోసం నిలిపివేశారు. గురుకుల ఉద్యోగాలు, సింగరేణి కాలరీస్, ఇంజినీరింగ్ పోస్టుల నోటిఫికేషన్లు కూడా నిలిచిపోయాయి. ఇప్పుడు అన్ని నోటికేఫికేషన్లు, కొత్తగా ఏర్పడిన ఖాళీలను కలిపి జాబ్ క్యాలెండర్ను ప్రభుత్వం రీ షెడ్యూల్ చేయనుంది. ఈ ప్రకారం త్వరలో రాష్ట్రంలో దశలవారీగా 27వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం.







