పసిడి ప్రియులకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. గోల్డ్ రేట్లు(Gold Rates) ఇటీవల తగ్గినట్లే కనిపించినా.. మళ్లీ ఒక్కసారిగా ఎగబాకుతున్నాయి. ఇటీవల తగ్గిందంతా కవర్ అయ్యేలా మార్కెట్ తీరు ఉండటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. అటు ఇంటర్నేషనల్ మార్కెట్లు, ఇటు దేశీయ మార్కెట్లలో గోల్డ్, సిల్వర్ రేట్లు రోజురోజుకు ఎగబాకుతున్నాయి. మరి ఈరోజు ఎలా ఉన్నాయంటే..
ఇక గురువారం హైదరాబాద్(Hyderabad)లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.490 పెరిగి రూ.97,910కు చేరింది. ఇక 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాములకు రూ.450 పెరిగి రూ.89,750 వద్ద కొనసాగుతోంది. అటు కేజీ వెండిపై రూ.1000 పెరిగి రూ.1,12,000వద్ద ట్రైడ్ అవుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
నష్టాల్లో ట్రేడవుతున్న మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్(Stock Markets) సూచీలు గురువారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నడుమ ఇన్వెస్టర్లు(Investers) అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం Nifty 212.95 పాయింట్ల నష్టంతో 24,600.50 వద్ద ట్రేడవుతోంది. అటు Sensex 706.31 పాయింట్లు నష్టపోయి 80,890.86 వద్ద కొనసాగుతోంది.






