ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు 65వ మ్యాచ్ జరుగుతోంది. లక్నో వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్(RCB vs SRH) జట్లు తలపడుతున్నాయి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్‌ను వాతావరణ పరిస్థితుల కారణంగా లక్నో ఇకానా స్టేడియానికి మార్చేశారు. ఈ మ్యాచులో టాస్ నెగ్గిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులోనూ ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్(Rajat Patidhar) దూరమవగా.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చే అవకాశం ఉంది. కాగా ఆర్సీబీకి జితేశ్ శర్మ కెప్టెన్సీ వహిస్తున్నాడు. అటు సన్ రైజర్స్ మూడు మార్పులు చేసింది. కరోనా నుంచి కోలుకున్న హెడ్(Head) ఈ మ్యాచులో తిరిగి జట్టులోకి వచ్చాడు.
#IPL2025: Royal Challengers Bengaluru stand-in captain Jitesh Sharma wins #toss, opts to #bowl against SunRisers Hyderabad.#RCBvsSRH #Sports #Sportskeeda #IPL #Cricket #CricketFever pic.twitter.com/QDv1bH12wB
— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) May 23, 2025
ఆర్సీబీ విజయం సాధిస్తే..
కాగా SRH ఇప్పటికే ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ కాగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస విజయాలతో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో RCB విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు వెళ్లనుంది. అయితే, లాస్ట్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ లక్నో ప్లే ఆఫ్స్ ఆశలపై నీళ్లు చల్లి ఎలిమినేషన్ జోన్లోకి నెట్టింది. ఇవాళ కూడా ఆర్సీబీని ఓడించి టాప్ ప్లేస్‌కి వెళ్లకుండా చేయాలని అనుకుంటోంది. ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు 24 మ్యాచ్‌లలో తలపడ్డాయి. అందులో ఆర్సీబీ 11, సన్‌రైజర్స్ 13 మ్యాచ్‌లలో గెలిచింది. చివరగా జరిగిన ఐదు మ్యాచ్‌లలో ఆర్సీబీ 3, సన్‌రైజర్స్ 2 మ్యాచ్‌లలో గెలిచింది.
తుది జట్లు ఇవే..
Sunrisers Hyderabad: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(W), నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్(C), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ
Royal Challengers Bengaluru: ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లి, మయాంక్ అగర్వాల్, జితేష్ శర్మ(W/C), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, లుంగి ఎన్గిడి, సుయాష్ శర్మ
PLAYING 11 RCB &SRH AT EKANA STEADIAM LUCKNOW #RCBvsSRH #RCBvSRH #SRHVSRCB #SRHvRCB #SRHvsRCB #IPL2025 #ViratKohli𓃵 pic.twitter.com/0QLlTDFIqv
— RO_KO fanclub🏏 (@MohammadFa83199) May 23, 2025






