KCR Kavitha Controversy: అవును కేసీఆర్‌కు లేఖ రాసింది నేనే: కవిత

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కవిత (Kavitha) లేఖ రాయడం.. అది బయటపడటంతో రెండు రోజులుగా జరుగుతున్న చర్చకు ఆమె క్లారిటీ ఇచ్చారు. అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు వచ్చిన కవిత మీడియాతో మాట్లాడుతూ.. ఆ లేఖ రాసింది నేనే అన్నారు. తాను అంతర్గతంగా రాసిన లేఖను ఎవరూ బహిరంగ పరిచారో తెలియడం లేదని అన్నారు. నేను రాసిన లేఖ ఇలా బయటకు వస్తే పార్టీలో సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

 

కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి

వరంగల్ లో బీఆర్ఎస్ రజతోత్సవ సభను గత నెలలో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఘనంగా నిర్వహించుకుంది. అయితే ఈ సభ ద్వారా కేసీఆర్ బీజేపీపై మరిన్ని విమర్శలు చేస్తే బాగుండేదని కవిత అభిప్రాయం వ్యక్తం చేసింది. అసలు తాను రాసిన లేఖ బయటకు ఎలా వచ్చిందో తేలాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ దేవుడని కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయని వాటిని వదిలించుకుంటేనే పార్టీ మనుగడ సాధ్యమని కుండబద్ధలు కొట్టారు. ఇలా తాను కేసీఆర్ (KCR) కు లేఖలు రాయడం మొదటి సారి కాదని కవిత అన్నారు. కొడుకు గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లిన కవిత శుక్రవారం రాత్రి హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు రావడంతోనే విలేకర్లతో మాట్లాడింది. అది తాను రాసిన లేఖే అని క్లారిటీ ఇవ్వడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆత్మరక్షణలో పడిపోయాయి. అసలు పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.

అసలు లేఖలో ఏముంది..

బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేయకుండా సాదాసీదాగా మాట్లాడటంపై ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు అనుమానిస్తున్నట్లు కేడర్ అనుకుంటుందన్నారు. బీఆర్ఎస్ నాయకులకే కాదు నాకు కూడా అలాగే అనిపించిందన్నారు. అయితే బీజేపీతో నేను పడిన ఇబ్బందుల వల్లే అలా అనిపిస్తుందేమో అనుకుంటున్నాను. కానీ రాష్ట్రంలో బీజేపీ అల్టర్నేట్ అనే భావన కేడర్ (BRS Cadre)లో కలుగుతుందని లేఖలో కవిత ప్రస్తావించింది. ప్రస్తుతం ఇదే అంశం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. అసలు కేసీఆర్ కూతురు కవిత లేఖ రాయడం ఏంటీ.. ఆమెతో కేసీఆర్ మాట్లాడటం లేదా.. చుట్టూ ఉన్న వ్యక్తులు ఆయన్ని కలవనీయడం లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *