Mahesh Babu: ఖలేజా రీరిలీజ్.. హాట్ కేకుల్లా అడ్వాన్స్ బుకింగ్స్!  

సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) డైరెక్షన్‌లో 2010, అక్టోబర్ 7న మూవీ ఖలేజా(Khaleja). ఈ మూవీ 15 ఏళ్ల కిందట రిలీజైనా.. బాక్సాఫీస్(Box Office) దగ్గర డిజాస్టర్‌గా మిగిలిపోయింది. కానీ ఆ తర్వాత మెల్లగా ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు రావడం మొదలుపెట్టింది. TVలో టెలికాస్ట్ అయినప్పుడల్లా మంచి రెస్పాన్స్ వచ్చేది. మహేష్ బాబు, అనుష్క(Anushka Shetty) కాంబో, సునీల్(Sunil) కామెడీ మూవీకి ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. అప్పట్లో ఈ మూవీని రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా.. కేవలం రూ.18 కోట్లే వచ్చాయి. అయితే ఇప్పుడీ మూవీని రీరిలీజ్(Re Release) చేయబోతున్నారు.

గంటకు 13 వేల టికెట్లు సేల్..

ఇదిలా ఉండగా ఖలేజా(Khaleja) మూవీ మే 30న రీరిలీజ్ కానుండగా ఇప్పటికే బుక్ మై షో(Book Myshow)లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం గంటకు 13 వేల టికెట్ల చొప్పున అమ్ముడవుతుండటం విశేషం. ఈ స్థాయి రెస్పాన్స్‌ను అసలు ఎవరూ ఊహించలేదు. అసలు రీరిలీజ్ మూవీస్ విషయంలో ఇదో సరికొత్త రికార్డు. గతంలో పవన్ కల్యాణ్ Gabbar Singh మూవీ రీరిలీజ్ సమయంలో గంటకు గరిష్ఠంగా 5.5 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. కానీ ఇప్పుడు ఖలేజా మూవీకి అంతకంటే ఎంతో ఎక్కువ స్థాయిలో టికెట్లు అమ్ముడవుతుండటం విశేషం.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *