తొలిప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డి ఇలా మారిపోయిందేంటి? చూస్తే షాక్ అవ్వాల్సిందే

పవన్ కళ్యాణ్ సినీ జీవితంలో మైలురాయిగా నిలిచిన చిత్రం తొలిప్రేమ. ఈ సినిమా అప్పట్లో యూత్‌కు బాగా కనెక్ట్ అయింది. ముఖ్యంగా ప్రేమికుడిగా పవన్ కళ్యాణ్ తన నటనతో యువతలో ఎంతో పాపులర్ అయ్యాడు. ప్రేమను వ్యక్తపరచడంలో తడబాటుతో కనిపించే పాత్రను పవన్ అద్భుతంగా నటించారు. ఈ చిత్రంలో కథానాయికగా నటించిన కీర్తి రెడ్డి కూడా ప్రేక్షకులను తన అందం, అభినయంతో ఆకట్టుకుంది.

చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన కీర్తి రెడ్డి, అదే వేగంతో ఇండస్ట్రీకి దూరమైంది. తొలిప్రేమ తర్వాత ఆమె తెలుగు, హిందీ, తమిళ చిత్రాల్లో నటించినా, తర్వాత అక్కినేని హీరో సుమంత్‌తో వివాహం చేసుకుంది. అయితే మనస్పర్థల వల్ల వారికి విడాకులు అయ్యాయి. అనంతరం ఆమె మరోసారి ఓ ఎన్నారైను పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడింది. ప్రస్తుతం ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇటీవలఇండియాలో జరిగిన ఒక ఫ్యామిలీ ఫంక్షన్‌కు హాజరైన కీర్తి, సమంత స్నేహితురాలైన ఫిట్‌నెస్ ట్రైనర్ శిల్పా రెడ్డితో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇద్దరు పిల్లలకు తల్లయినా కీర్తి రెడ్డి అందంలో ఏమాత్రం మారలేదు అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *