
అమ్మను కలవాలంటే కండిషన్స్ పెట్టారని, ఆమెను ఎంతో మిస్ అవుతున్నానని హీరో మంచు మనోజ్ ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశాడు. బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ (Nara Rohit) ముగ్గురు హీరోలుగా బైరవం అనే సినిమాలో యాక్ట్ చేశారు. ఈ మూవీ మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంచు మనోజ్ (Manchu Manoj) ప్రమోషన్స్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన కుటుంబంతో ఉన్న అనుబంధం తదితర విషయాలు పంచుకుంటున్నారు.
గొడవల వల్ల అక్కని కూడా దూరం పెట్టాల్సిన పరిస్థితి..
మా కుటుంబంలో గొడవలు జరిగిన తర్వాత ఎన్నో విషయాల్లో బాధపడ్డానని తన కూతుర్ని నాన్న మోహన్ బాబు (Manchu Mohan Babu) ఎత్తుకుంటే చూడాలని ఉందని బావోద్వేగానికి గురయ్యారు. మా అమ్మను కలవాలంటే కండిషన్ పెట్టారు. ఇంట్లో లోపలికి రానీయడంలేదు. ఆమెనే బయటకు వచ్చి మమ్మల్ని కలవాలి. గతంలో చాలా సార్లు ఇంట్లో గొడవలు జరిగినా నేను ఎన్నడూ బయటకు వచ్చి చెప్పాలనుకోలేదు. సీసీ టీవీ పుటేజీలు మాయం చేశారు. గొడవల వల్ల అక్క మంచు లక్ష్మిని కూడా దూరం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. నాన్న అంటే చాలా ఇష్టమని ఏ రోజు కూడా కోపం లేదని మంచు మనోజ్ అన్నారు.
తప్పు చేసిన వాడినైతే దాక్కుంటా
గతంలో నేను ఒంటిరివాడినే అప్పుడు ఎన్ని సార్లు ఏం చేసినా భరించా. కానీ ఇప్పుడు నాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిని సంరక్షించుకోవాలి కదా అన్నారు. ఈ గొడవల్లో నా భార్య మౌనికకు ఎలాంటి సంబంధం లేదు. ముఖ్యంగా ఆమె తన తల్లిదండ్రుల్ని చిన్నప్పుడే పోగొట్టుకుంది. తప్పు చేసిన వాడినైతే దాక్కుంటా కానీ చేయని తప్పునకు శిక్ష విధిస్తానంటే ఒప్పుకోను. ఇప్పటికీ వారిపైనా నాకు ద్వేషం లేదు. ప్రేమతోనే ఉంటాను అని మంచు మనోజ్ అన్నారు. మొత్తం మీద బైరవం సినిమా మే 30న రిలీజ్ (Bairavam release on May 30) కానుంది. ఈ ప్రమోషన్లలోనే మంచు మనోజ్ బిజీ బిజీగా గడుపుతున్నారు.