ఐపీఎల్ చివరి లీగ్ మ్యాచులో ఆర్సీబీ లక్నో పై సంచలన విజయం నమోదు చేసింది. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ( Rishabh Pant) సెంచరీతో చెలరేగడంతో ఫస్ట్ ఇన్సింగ్స్ లో 227 పరుగుల భారీ స్కోరు ఆర్సీబీ ముందు ఉంచింది. రిషబ్ చివరి మ్యాచులో 118 పరుగులు చేశాడు. దీని కోసం 6 సిక్సులు, 11 ఫోర్లు బాదాడు. మిచెల్ మార్ష్ నాలుగు ఫోర్లు, అయిదు సిక్సులతో 67 పరుగులు చేసి లక్నో భారీ పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో లక్నో 227 పరుగులతో ఇన్సింగ్స్ ముగించింది.
విరాట్ కొహ్లీ, ఫిల్ సాల్ట్ దూకుడు
అనంతరం బ్యాటింగ్ కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కొహ్లీ (virat kohli) దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. 121/4 పరుగుల టీం స్కోరు వద్ద విరాట్ కొహ్లీ (50) అవుట్ అయ్యాడు. దీంతో ఆ సమయంలో అందరూ ఆర్సీబీ గెలవదేమో అని అనుకున్నారు. కానీ తాత్కాలిక కెప్టెన్ జితేశ్ శర్మ దూకుడుగా ఆడి టీంను గెలిపించడంతో పాటు ఏకంగా టాప్ 2 కు చేర్చాడు.
జితేశ్ మెరుపు బ్యాటింగ్
జితేశ్ శర్మ ( jitesh sharma ) మెరుపు ఇన్సింగ్స్ ఆడాడు. దిగ్వేశ్ రాఠి బౌలింగ్ అవుట్ తప్పించుకున్నాక ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 33 బంతుల్లోనే 6 సిక్సులు, ఎనిమిది ఫోర్లతో 85 పరుగులు చేశాడు. దీంతో ఆర్సీబీ 2016 తర్వాత క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడేందుకు అవకాశం లభించింది. ఇంకా రెండు మెట్లు ఎక్కాలి. ఒకటి క్వాలిఫైయర్ లో పంజాబ్ ను మట్టికరిపించి ఫైనల్ చేరాలి. ఫైనల్ లో విజయం సాధించి ఆర్సీబీ అభిమానుల చిరకాల కోరిక తీర్చాలి. ఐపీఎల్ కప్ కోసం ఆర్సీబీ అభిమానులు, కొహ్లీ ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. ఇక కప్ సొంతమే అని అనుకుంటున్నారు.






