భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ టీ. దిలీప్(T Dileep) తిరిగి భారత క్రికెట్ జాతీయ జట్టులోకి మళ్లీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. దిలీప్ కాంట్రాక్ట్ గతేడాది అయిపోవడంతో అతడి ప్రతిభకు మెచ్చి ఏడాది పాటు కాంట్రాక్టు పొడిగించారు. రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) కోచ్ పదవి కాలం పూర్తి కాగానే కొత్త కోచ్ గా గౌతం గంభీర్ వచ్చాక సపోర్టు టీం మొత్తం మార్చేసినా దిలీప్ ను మాత్రం కొనసాగించారు. దిలీప్ పదవీ కాలం ఈ మే నెల చివరి నాటికి అయిపోతుంది. కానీ దిలీప్ ను ఇంగ్లాండ్ తో జరిగే టెస్ట్ సిరీస్ కు ఫీల్డింగ్ కోచ్ గా సెలెక్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది.
రోహిత్ శర్మతో మంచి బాండింగ్
బీసీసీఐ దిలీప్ తో ఒప్పందాన్ని పొడిగించే అవకాశం లేనట్లు కనిపించింది. కానీ దిలీప్ కు కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య మంచి బాండింగ్ ఉండటం వల్ల రోహిత్ ఇన్ ప్లూయెన్స్ వాడటంతో తిరిగి భారత జట్టులో ఫీల్డింగ్ కోచ్ గా చేరనున్నట్లు సమాచారం. కాగా గత నెలలోనే కాంట్రాక్టు ముగియడంలో అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ (Abhishek Nair)ను బీసీసీఐ ఇంటికి పంపించింది. దీంతో వెంటనే అభిషేక్ నాయర్ కోల్ కతా నైట్ రైడర్స్ టీంలో సహాయక కోచ్ గా చేరిపోయాడు.
జూన్ 6న ఇంగ్లండ్ కు భారత జట్టు
రోహిత్ శర్మ వ్యక్తిగతంగా గంభీర్ (Gautam Gambhir) తో మాట్లాడి దిలీప్‌ను కొనసాగించాల్సిందిగా విజ్ఞప్తి చేశారని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఇండియా ఏ జట్టు, కొంతమంది టెస్ట్ జట్టు సభ్యులు ఇంగ్లండ్‌లో కెంట్ కు చేరుకున్నారు. మే 30 నుంచి జూన్ 2 వరకు ఇంగ్లండ్ లయన్స్‌తో తొలి అన్-ఆఫీషియల్ టెస్టు మ్యాచ్ జరగనుంది. జూన్ 3న ఐపీఎల్ అయిపోగానే జూన్ 6 వ తేదీన ముంబయి నుంచి భారత్ టెస్టు జట్టు ఇంగ్లండ్ బయలుదేరనుంది. ఇంగ్లండ్ లో అయిదు టెస్టుల సిరీస్ శుభమన్ గిల్ కెప్టెన్సీలో ఆడనుంది.






