
దేశంలో నైరుతి రుతుపవనాలు(Southwest Monsoons) వేగంగా విస్తరిస్తున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం భువనేశ్వర్‌కి దగ్గర్లో ఉన్నా.. క్రమంగా బెంగాల్ వైపు కదులుతోంది. ఇవాళ సాయంత్రానికి అది కోల్‌కతాకి దగ్గర్లోని హైదా(Hyda) దగ్గర తీరం దాటే పరిస్థితి ఉంది. దీని వేగం గంటకు 50KMగా ఉంది. అందువల్ల సాయంత్రం నుంచి AP, తెలంగాణ(TG)కి భారీ వర్ష సూచన ఉంది. అది కోల్‌కతా దగ్గర తీరం దాటినా.. దాని ప్రభావం మన తెలుగు రాష్ట్రాలపై కూడా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇవాళ్టి నుంచి మే 31 వరకూ వానలు
కాగా ఇవాళ (గురువారం) నుంచి మే 31 వరకూ ఏపీ, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే 29, 30 తేదీల్లో రెండు రాష్ట్రాల్లో చాలాచోట్ల భారీ వర్షాలు కురుస్తాయంది. తెలంగాణలో 29, 30 తేదీల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి అని IMD చెప్పింది. గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుంది. అలాగే ఇవాళ రాయలసీమ, యానాం, కోస్తాంధ్రలో గంటకు 50 నుంచి 60KM వేగంతో గాలులు వీస్తాయనీ, ఒక్కోసారి గంటకు 70KM వేగంతో వీస్తాయని అంచనా వేసింది. ఇవాళ ఏపీకి పిడుగుల హెచ్చరిక(Thunderstorm warning) జారీ చేసింది.