భారత్ ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాక్ పై శక్తిమంతమైన దాడులతో విరుచుకుపడటంలో పాకిస్థాన్ ప్రపంచ దేశాలపై పడి ఎలాగైనా సరే దాడులను ఆపాలని వేడుకుందని కేంద్ర రక్షణ శాఖ (Union Defence Minister Rajnath Singh) మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. శుక్రవారం భారత నౌకదళం బాస్ విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా రక్షణమంత్రి పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
నావికాదళం చూపిన పాత్ర వెలకట్టలేనిది..
ఆపరేషన్ సిందూరు (Operation Sindoor) సమయంలో నావికాదళం చూపిన పాత్ర వెలకట్టలేనిది. పాక్ దేశంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దళం విరుచుకుపడి నేలమట్టం చేసింది. దీంతో పాటు సముద్రంలో నావికాదళం ప్రిపరేషన్ చూసి పాకిస్థాన్ వణికిపోయింది. పాక్ నావికాదళాన్ని ఎక్కడా కూడా కదలనీయకుండా చేసింది. భారత్ ముందస్తు మోహరింపుతో పాక్ ను మానసికంగా దెబ్బకొట్టడంతో పాటు వారి ఎయిర్ బేస్ లపై దాడులతో నావికా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. ఇండియన్ నేవీ శక్తి సామర్థ్యాలు, ధైర్య సాహసాలు చూసి శత్రుదేశం భయాందోళనకు గురైందని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. పాకిస్థాన్ తో ఆపరేషన్ సిందూర్ ముగియలేదని తాత్కాలిక విరామం మాత్రమే తీసుకున్నామని ప్రకటించారు.
జలంతర్గాములను మోహరించడంతో..
ఐఎన్ ఎస్ విక్రాంత్ (INS Vikrant) బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన యుద్ద నౌకలు జలంతర్గాములను మోహరించడంతో పాక్ కు ఊపిరి తీసుకోకుండా భారత నావికాదళం ఎదురుదాడికి దిగిందని పేర్కొన్నారు. ఆపరేషన్ లో భాగంగా ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసిన తర్వాత వెంటనే పాక్ నావికాదళం కోలుకోకుండా దెబ్బతీసినట్లు ఆయన పేర్కొన్నారు.






