
క్రమంగా నాలుగు రోజులపాటు తగ్గిన బంగారం ధరల్లో శనివరం ఎలాంటి మార్పులు జరగలేదు. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. ఈరోజు (gold rates today may 31st 2025) ఉదయం 9.30 గంటల నాటికి హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ ధర రూ.97,310గా ఉంది. శుక్రవారం సాయంత్రం కూడా ఇదే ధర ఉంది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 89,200గా నమోదైంది. అయితే దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.290 పెరిగి రూ.97,470కి చేరుకోగా, 22 క్యారెట్ గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.89,360కు చేరుకుంది.
కిలో వెండి ధర రూ.110,800
అయితే వెండి ధరలు మాత్రం తగ్గాయి. కేజీ వెండి ధర రూ.100 తగ్గింది. దీంతో హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి రేటు రూ.110,800గా ఉంది. ధిల్లీలో ధర రూ.99,800 ఉంది. బెంగళూరు, ముంబై, పూణే, లక్నో, సూరత్, పాట్నా, అయోధ్య వంటి ప్రాంతాల్లో కూడా కిలో వెండి ధర రూ.99,800గా ఉంది.