ఏపీలో మెగా డీఎస్సీ (AP Mega DSC) పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది. జూన్ 6 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. రోజుకు రెండు షిఫ్టుల్లో ఆన్‌లైన్ మోడ్ (Online Exams)లో నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. 16,347 పోస్టులతో ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. వివిధ విభాగాల పోస్టులకు మొత్తం 3,35,401 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో ఏపీతోపాటు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఉన్నారు. దీంతో రాష్ట్రంతోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. దరఖాస్తు సమయంలోనే పరీక్ష కేంద్రాలకు సంబంధించి ఆప్షన్స్ కూడా ఇచ్చారు. పరీక్షలకు సంబంధించిన వివరాలు, హాల్‌టికెట్లను (Hall tickets) అధికారిక వెబ్‌సైట్ https://apdsc.apcfss.in/ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Ap Dsc schedule 2025 pic.twitter.com/aOJjXZk9tr
— HarisJay (@bandaru_ha89102) May 31, 2025






