MLC Kavitha: జూన్ 4న ఎమ్మెల్సీ కవిత నిరసన.. BRS శ్రేణుల స్పందనేంటి?

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీస్ ఇవ్వడంపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జూన్ 4న ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)అధ్యక్షతన ఇందిరా పార్క్ వద్ద నిరసన తెలపనున్నట్లు ప్రకటించారు. కాగా శనివారం సాయంత్రమే తెలంగాణ జాగృతి (telangana jagruthi) కార్యాలయాన్ని బంజారాహిల్స్ లో ఆమె ప్రారంభించనున్నారు. ఈ సమయంలో మళ్లీ కార్యాలయం ప్రారంభంపై బీఆర్ఎస్ మౌనం పాటిస్తోంది.

ముదరుతున్న వివాదం

కేసీఆర్ తనకు దేవుడని ఆయన చుట్టూ దెయ్యాలున్నాయని తాను రాసిన లేఖ ఎలా బయటకు వచ్చిందో తెలపాలని ఏకంగా కేటీఆర్ (ktr), హరీశ్ రావును టార్గెట్ చేస్తూ కవిత కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే కేసీఆర్ తన మిత్రులు ఇద్దరినీ పంపించి కవితతో రాయబారం నడిపారు. కానీ నేరుగా కేసీఆర్ ను కలవకపోవడం, ఆయన అనుమతి ఇవ్వలేడనే వార్తలతో కవిత, బీఆర్ఎస్ కు దూరం అయిపోయినట్లే అని అనుకుంటున్నారు. కొంతమంది మాత్రం కావాలనే ఆడుతున్న డ్రామాలు అని అంటున్నారు. మరికొందరు ఆస్తి పంపకాలతో విభేదాలు వచ్చినట్లు మాట్లాడుకుంటున్నారు.

Warangal speech lacked punch: Kavitha tells KCR

కేటీఆర్‌కు నోటీసులు వస్తే ధర్నాలు చేయరా?

కేటీఆర్ కు గతంలో ఓ కేసులో నోటీసులు జారీ కాగా బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగాయి. కానీ కేసీఆర్‌‌కు కాళేశ్వరం కమిషన్ (kaleshwaram commishan) నోటీసులు జారీ చేసినా బీఆర్ఎస్ నాయకులు కనీసం నిరసనలు తెలపడం లేదని కవిత మండిపడ్డారు. ఇప్పటికే మీడియాతో ఈ విషయంపై చిట్ చాట్ లో స్పందించారు. తాను వేరే పార్టీ పెట్టడం లేదని తాను బీఆర్ఎస్ లో ఉన్నానని తనను తీసేసే ధైర్యం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత ఎవరనే దానిపై ముగ్గురి మధ్య పోరు నడుస్తున్నట్లు అర్థమవుతుంది. అందుకే కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద జూన్ 4 నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించారు. మరి ఈ నిరసనకు బీఆర్ఎస్ శ్రేణులు మద్దతు తెలుపుతాయా? లేదా త్వరలోనే తేలనుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *