నటి శ్రీలీల (Sreeleela) ఇంట్లో జరిగిన వేడుక నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇన్‌స్టా వేదికగా శుక్రవారం నటి కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అయితే అందులో శ్రీలీలను ముస్తాబు చేసి ఆమెకు పసుపు పూయడం, ఆ వేడుకలు చూసిన నెటిజన్లు ఆమె సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకుందని, త్వరలో పెళ్లి పీటలెక్కనుందంటూ చర్చించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వార్తలపై ఆమె స్పష్టతనిచ్చారు. అవి తన బర్త్‌డే ముందస్తు వేడుకలని వివరించింది.
ప్లానింగ్ అంతా మా అమ్మే చూసుకుంది: శ్రీలీల
‘‘నా ప్రీ బర్త్‌డే (pre birthday) వేడుకలను ఇంట్లోనే మేము ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం. దీనికి సంబంధించిన ప్లానింగ్ అంతా మా అమ్మ చూసుకున్నారు’’ అని ఆమె ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ఈ వేడుకల్లో రానా సతీమణి మిహిక కూడా పాల్గొన్నారు. ఇందులో శ్రీలీల చీరకట్టులో కనిపించారు. జూన్ 14న ఆమె 24వ పుట్టినరోజు చేసుకోనుంది.
#Sreeleela Pre-Birthday Celebrations ❤️🫶#Sreeleela #Sreeleelafans pic.twitter.com/FwMg97w6Zm
— Cinema Filters (@siri_cinema) June 1, 2025
దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ జోరుమీదుంది శ్రీలీల. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం ఆమె ఇన్‌స్టా స్టోరీస్‌లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ‘బిగ్ డే’, ‘కమింగ్ సూన్’ అనే క్యాప్షన్ జత చేశారామె. వాటిని చూసిన నెటిజన్లు ఆమెకు నిశ్చితార్థం జరిగి ఉంటుందని భావించారు. ఈనేపథ్యంలోనే వాటికి చెక్ పెడుతూ స్పందించింది.






