
నటి సమంత (Samantha) నిర్మాతగా, ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో రూపొందించిన సినిమా‘శుభం’ (Shubham). మే 9న థియేటర్లలో రిలీజై విడుదలైన మంచి టాక్ తెచ్చుకుంది. ఈ కామెడీ హారర్ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. జూన్ 13 నుంచి జియో హాట్‌స్టార్ (Hotstar) వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ సంస్థ ఓ పోస్టర్ విడుదల చేసింది. ‘చచ్చినా చూడాల్సిందే’ అంటూ ఫన్నీ క్యాప్షన్‌ను జోడించింది. ఈ సినిమాలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రియా కొంతం, చరణ్ పేరి ప్రధాన పాత్రలో నటించారు. సమంత ఓ కీలక రోల్లో తళుక్కుమన్నారు.
ఇదీ స్టోరీ..
సినిమాలోలని ముగ్గురు స్నేహితుల ఇళ్లలో వారి భార్యలు రాత్రి 9 గంటలకు జన్మజన్మల బంధం టీవీ సీరియల్ చూస్తూ ఏవో ఆత్మలు ఆవహించినట్టుగా వింతగా ప్రవర్తిస్తుంటారు. సీరియల్ చూడడాన్ని ఎవరైనా అడ్డుకుంటే వారిపై దాడులకు తెగబడి మరీ చూస్తూ భయపెడుతుంటారు. సీరియల్ పూర్తయ్యాక మళ్లీ మామూలుగా మారతారు. అయితే ఊళ్లో అందరి ఇళ్లల్లోనూ ఇదే జరుగుతోందని గుర్తిస్తారు. అసలు ఎందుకిలా జరుగుతోంది? ఆత్మల సమస్యలకి పరిష్కారం కోసం మాయ మాతా శ్రీ (సమంత) దగ్గరికి వెళితే ఆమె ఎలాంటి సలహా ఇచ్చింది అనేది కథ.