‘హిట్’ సిరీస్‌లతో ఆకట్టుకున్న శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో శ్రీకాంత్ తనయుడు, యంగ్ హీరో రోషన్ (Roshan) నటించనున్నాడా అంటే ఔననే అంటున్నాయి సినీ వర్గాలు. నానీతో పూర్తిస్థాయి యాక్షన్ సినిమా‘హిట్ 3’తో విజయాన్ని అందుకున్నారు శైలేష్. ఆయన తీసిన హిట్, హిట్ 2తో పాటు వెంకటేశ్‌తో తెరకెక్కించిన సైంధవ్ కూడా యాక్షన్ మూవీనే. అయితే ఇప్పుడు ట్రాక్ మార్చి రోషన్‌తో ఓ ప్రేమ కథను రూపొందించనున్నట్లు బాక్సాఫీస్ వద్ద టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నాగవంశీ ఈ సినిమాను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు వినికిడి.
రెండు సినిమాలతో బిజీగా ఉన్న రోషన్
ఇక ప్రస్తుతం రోషన్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రదీప్ అద్వైతం తెరకెక్కిస్తున్న ‘ఛాంపియన్’ (Champion)లో నటిస్తున్నారు. స్పోర్ట్స్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ 70 శాతం షూటింగ్ పూర్తయింది. దీనితోపాటు మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘వృషభ’లోనూ రోషన్ నటిస్తున్నారు. ఈ మూవీని నంద కిషోర్ తెరకెక్కిస్తున్నారు.






