సినీ ఇండస్ట్రీలో కొన్ని పాత్రలు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదిస్తాయి. అలాంటి పాత్రలలో ఒకటి ‘వంటలక్క’గా గుర్తింపు పొందిన ప్రేమి విశ్వనాథ్(Premi Viswanath). మలయాళం టెలివిజన్ నుంచి తన ప్రయాణం ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాల్లో స్టార్‌గా ఎదిగిన ఈ టాలెంటెడ్ నటి ఒకే సీరియల్‌తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది.
ప్రేమి విశ్వనాథ్ 1991 డిసెంబరు 2న కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులం జిల్లా ఎడప్పల్లిలో జన్మించింది. 2014లో మలయాళం టెలివిజన్ సీరియల్ ‘కరుత్తముత్తు’ ద్వారా టీవీ రంగంలోకి ప్రవేశించారు. ఈ సీరియల్‌లో ఆమె కర్తిక పాత్రలో నటించింది. సామాజికంగా వెనుకబడ్డ వర్గాల మహిళలను ప్రతిబింబించేలా తన పాత్రలో జీవించింది. ఈ పాత్ర ద్వారా ఆమె మలయాళ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 2014లో ఆసియానెట్ టెలివిజన్ అవార్డ్స్‌లో ‘బెస్ట్ డెబ్యూటెంట్ ఫిమేల్’ అవార్డు గెలుచుకుంది.
మలయాళం సీరియల్ ‘కరుత్తముత్తు’ ఆధారంగా తెలుగు రీమేక్ గా స్టార్ మా ఛానల్‌లో మార్చి 2017 అక్టోబర్ 16 న ప్రసారమైన కార్తీకదీపం(Karthika Deepam) సీరియల్ ఏ స్థాయిలో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సీరియల్ లో ప్రేమి విశ్వనాథ్ ‘దీపా’ పాత్రలో నటించి, “వంటలక్క”గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
ఈ సీరియల్ లో ప్రేమి విశ్వనాథ్ తో పాటు నిరుపమ్, హిమ, శౌర్య, సౌందర్య పాత్రల నటన కూడా సీరియల్ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. ప్రేమి విశ్వనాథ్ నటనకు 2018లో స్టార్ మా పరివార్ అవార్డ్స్‌లో “బెస్ట్ యాక్ట్రెస్” అవార్డు కూడా లభించింది.
కార్తీకదీపం సీరియల్ ద్వారా బుల్లితెరపై తన స్థానాన్ని పటిష్ఠం చేసుకున్న ప్రేమికి భారీ క్రేజ్ ఏర్పడింది. దాంతో ఆమె రెమ్యునరేషన్ విషయంలోనూ టాప్ హీరోయిన్‌లను తలదన్నే స్థాయికి చేరింది.
ప్రేమి విశ్వనాథ్ సుమారు 50 కోట్లకు పైగానే ఆస్తి ఉందని తెలుస్తోంది. అదేవిధంగా రెండు లగ్జరీ కార్లు, ఓ విలాసవంతమైన భవనం ఉన్నాయని సమాచారం.. ఇంకా కేరళలో రెండు స్టూడియోలు కూడా ఉన్నాయట. ఆ స్టూడియోల్లో సినిమా, టీవీ సీరియల్‌లకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుంటాయట.
ప్రేమి విశ్వనాథ్ ప్రస్తుతం కార్తీకదీపం 2 సీరియల్‌లో నటిస్తోంది. ఇది తమిళంలో హిట్టయిన ‘చెల్లమ్మ’ సీరియల్ రీమేక్. ఈ ప్రాజెక్ట్‌కి కూడా ఆమె భారీ పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం.






