రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఐపీఎల్ ట్రోఫీ(IPL Trophy 2025) నెగ్గిన సంతోషం ఆ జట్టుకు 24 గంటలు కూడా మిగల్చలేదు. 18 ఏళ్ల తర్వాత తొలి సారి కప్ నెగ్గిన ఆ జట్టుకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట(Stampede) ఘటన తీరని బాధని మిగిల్చింది. అటు జట్టు టైటిల్ గెలుచుకున్న ఆనందం ఫ్యాన్స్‌కూ ఈ ఘటన ముందు చిన్నబోయింది. చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium) వెలుపల జరిగిన సంబరాల్లో భారీ తొక్కిసలాట చోటు చేసుకోవడంతో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

దాదాపు 2 లక్షల మంది అభిమానులు
RCB జట్టు ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న ఆనందంలో పాలుపంచుకోవడానికి దాదాపు 2 లక్షల మంది అభిమానులు(Fans) చిన్నస్వామి స్టేడియంకు పోటెత్తారు. భారీగా తరలివచ్చిన జనసందోహాన్ని అదుపు చేయడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. దీంతో ఒక్కసారిగా తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగి, పలువురు అభిమానులు కిందపడిపోయారు. ఊపిరాడక కొందరు, తీవ్ర గాయాలపాలై మరికొందరు ప్రాణాలు విడిచారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనతో బెంగళూరు నగరంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.

RCB, KCA దిగ్భ్రాంతి, ఆర్థిక సాయం ప్రకటన
ఈ దురదృష్టకర ఘటనపై ఆర్సీబీ యాజమాన్యం, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KCA) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. “చిన్నస్వామి స్టేడియంలో RCB నిర్వహించిన సంబరాల్లో జరిగిన దురదృష్టకర సంఘటన పట్ల RCB-KCA తీవ్ర ఆందోళన, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాయి. ఈ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆర్సీబీ,కేఎస్‌సీఏ రూ.5 లక్షలు ఆర్థిక సాయం(Financial Assistance) ప్రకటించాయి. అయితే ఈ పరిహారం మానవ ప్రాణానికి విలువ కట్టడానికి ఉద్దేశించినది కాదని, కేవలం ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు తమ మద్దతు, సంఘీభావం(solidarity) తెలియజేసేందుకు మాత్రమే’ అని స్పష్టం చేశాయి. అటు ఆ జట్టు ప్లేయర్ విరాట్ కోహ్లీ సైతం ఘటనపై స్పందించాడు. అనుకోని ఘటన తమను తీవ్రంగా కలిచివేసిందని, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపాడు.
𝗢𝗳𝗳𝗶𝗰𝗶𝗮𝗹 𝗦𝘁𝗮𝘁𝗲𝗺𝗲𝗻𝘁: 𝗥𝗼𝘆𝗮𝗹 𝗖𝗵𝗮𝗹𝗹𝗲𝗻𝗴𝗲𝗿𝘀 𝗕𝗲𝗻𝗴𝗮𝗹𝘂𝗿𝘂
We are deeply anguished by the unfortunate incidents that have come to light through media reports regarding public gatherings all over Bengaluru in anticipation of the team’s arrival this… pic.twitter.com/C0RsCUzKtQ
— Royal Challengers Bengaluru (@RCBTweets) June 4, 2025






