Stampede Incidents: దేశంలో తొక్కిసలాట ఘటనలు.. మరణాలు ఇవే!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) 18 ఏళ్ల తర్వాత ట్రోఫీ నెగ్గిన తర్వాత నిర్వహించిన విజయోత్సవ వేడుకలు(Victory Celebrations) తీవ్ర విషాదాన్ని నింపిని విషయం తెలిసిందే. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించగా.. 50 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటన కర్ణాటక(Karnataka)లో కలకలం సృష్టించింది. తాజా ఘటనతో దేశంలో గతంలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలు, మరణాలు, గాయపడిన సంఘటనలు సోషల్ మీడియా(SM)లో వైరల్‌ అవుతున్నాయి. అవేంటో ఓసారి చూద్దామా..

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, మహాకుంభ మేళాలో..

ప్రయాగ్‌రాజ్‌(Prayag Raj)లో జరిగిన మహా కుంభమేళా(Maha Kumbh 2025)లో జనవరి 29న ‘మౌని అమావాస్య’ సందర్భంగా తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాట(Stampade)లో దాదాపు 30 మంది మరణించగా, మరో 60 మందికిపైగా జనం గాయపడ్డారు. ఇక మహా కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్లే రైళ్ల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికుల మధ్య న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌(New Delhi Railway Station)లో ఫిబ్రవరి 15న జరిగిన తొక్కిసలాటలో 11 మంది మహిళలు, ఐదుగురు చిన్నారులతో సహా మొత్తం 18 మంది మరణించారు.

Stampede at the New Delhi Railway station leaves 18 dead, Probe ordered

గోవా ఆలయం, తిరుపతి ఆలయంలో..

ఉత్తర గోవాలోని షిర్గావ్‌లో వార్షిక లైరాయ్ దేవి జాతర (Procession) సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. రాష్ట్ర రాజధాని పనాజీ(Panaji)కి సుమారు 40KM దూరంలో ఉన్న ప్రఖ్యాత శ్రీ దేవి లైరాయ్ ఆలయం(Sri Devi Lairai Temple) వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఏపీలోని తిరుపతి(Tirupathi)లో వైకుంఠ ద్వార సర్వదర్శనం(Vaikuntha Dwara Sarvadarshan) టోకెన్ల పంపిణీ సందర్భంగా జనవరి 8న జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు. తిరుపతిలోని విష్ణు నివాసంలో ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.

Tirupati temple stampede - What triggered Tirupati temple stampede - India  Today

సంధ్య థియేటర్, హత్రాస్ సత్సంగ్ ఘటనలు

డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌(Sandya Theatre)లో ‘పుష్ప 2: ది రూల్’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 35 ఏళ్ల మహిళ మరణించగా, ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు గాయపడ్డాడు.

Pushpa 2 Stampede Crowd Gathered To See Allu Arjun In Hyderabad Went Out Of  Control Woman Dies Two Injured - Amar Ujala Hindi News Live - Pushpa 2  Stampede:हैदराबाद में अल्लू अर्जुन

ఇక ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌(Hatras)లో ‘భోలే బాబా’గా పేరుపొందిన నారాయణ్ సకార్ హరి సత్సంగ్‌(Narayan Sakar Hari Satsang)కు హాజరైన జనసందోహం మధ్య జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించారు.

कौन हैं हाथरस के भोले बाबा, जिसके सत्संग में गई सैकड़ों लोगों की जान

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *