
బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణే(Deepika Padukone) డైరెక్టర్ అట్లీ-అల్లు అర్జున్(Atlee-Allu Arjun) కాంబోలో తెరకెక్కుతోన్న ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు దీపిక అల్లు అర్జున్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కాగా ఈ చిత్రం ఒక పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. దీపికా ఇందులో ఓ కీలక పాత్ర పోషించనుంది. ఈ ప్రాజెక్ట్‌లో జాన్వీ కపూర్(Janvi Kapoor), మృణాల్ ఠాకూర్(Mrinal Thakur) వంటి ఇతర హీరోయిన్లు కూడా నటిస్తున్నట్లు సమాచారం.
కత్తి పట్టి సాహసాలు చేయనున్న దీపిక
ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్(Sun Pictures) 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. హాలీవుడ్ టెక్నీషియన్స్ సాయంతో విజువల్ ఎఫెక్ట్స్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. కాగా దీపికకు అల్లు అర్జున్‌తో తొలి సినిమా కాగా.. అట్లీతో రెండో మూవీ. గతంలో అట్లీ తెరకెక్కించిన జవాన్(Jawan) మూవీలో దీపిక ఓ కీలక పాత్రలో నటించారు. కాగా కల్కి(Kalki) తరువాత దీపికా నటిస్తున్న రెండో తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం. AA22xA6 మూవీలో కత్తి పట్టి సాహసాలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల రెండో వారం నుంచి ముంబైలో జరిగే షూటింగ్‌లో దీపిక పాల్గొననున్నట్లు సమాచారం.
Sayyi aaaaaaah 💥💥💥💥💥💣#AA22xA6 pic.twitter.com/NAuklLHPbt
— vijay (@MedidiVijay) June 7, 2025