బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 తాండవం సినిమా చేస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా అఖండ సీక్వెల్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అఖండ 2 సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో అఖండ 2 షూటింగ్ ప్రారంభమైంది. పవిత్రమైన ఈ ప్రాంగణంలో సినిమా ప్రారంభం కావడంతో, విజయం ఖాయం” అని కామెంట్లు చేస్తున్నారు నందమూరి అభిమానులు.
ఇప్పటివరకు సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రమోషనల్ అప్డేట్ రాకపోయినా, జూన్ 8 ఉదయం 10:54కి మేకర్స్ శుభవార్త చెప్పారు. టీజర్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. రేపు జూన్ 9 సాయంత్రం 6:03 గంటలకు టీజర్ విడుదల కానుంది. ఈ విషయాన్ని నిర్మాతలు ట్వీటర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. “గాడ్ ఆఫ్ మాసెస్ – తాండవం మొదలవుతోంది” (God of Masses – Teaser Thandavam Begins) అంటూ ప్రకటించడంతో పాటు ఒక త్రిశూలం ఉన్న పోస్టర్ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్లు కథానాయికలుగా కనిపించనున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్ మళ్లీ మరోసారి మాస్ బీట్లతో రెడీ అవుతున్నాడు. అఖండలో తమన్ కంపోజ్ చేసిన నేపథ్య సంగీతం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఇప్పుడు ఆయనపై, సంగీతంపై మరింతగా అంచనాలు పెరిగిపోయాయి.






