అగ్ర కథానాయకుడు బాలకృష్ణ (Balakrishna) పుట్టినరోజును పురస్కరించుకొని ఆయనకు విషెస్ వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు బాలయ్య బాబుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పవన్ కల్యాణ్, నారా లోకేశ్, కల్యాణ్ రామ్ ఇలా పలువురు ఆయనకు విషెస్ తెలుపుతూ పోస్టులు పెట్టారు.
‘శతాధిక చిత్రాల కథానాయకుడు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. చారిత్రక, జానపద, పౌరాణిక పాత్రలు పోషించి మెప్పు పొందిన కథానాయకుడాయన. ప్రజా జీవితంలో భాగంగా హిందూపురం ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖసంతోషాలు అందించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ – పవన్ కల్యాణ్
‘సిల్వర్ స్క్రీన్‌పై ఆయన లెజెండ్.. పొలిటికల్ స్క్రీన్‌పై ఆయన అన్‌స్టాపబుల్.. ప్రజల గుండెల్లో ఆయన బాలయ్య.. నా ముద్దుల మావయ్య పద్మభూషణ్ బాలకృష్ణకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’ – నారా లోకేశ్
‘హ్యాపీ బర్త్‌డే బాల మామ. మీరు ఎంతోమందికి స్ఫూర్తి. మీరు ఇలాగే అన్‌స్టాపబుల్‌గా ముందుకుసాగాలి. ఎన్నో విజయాలను అందుకోవాలి’. – నారా రోహిత్
ఈ రికార్డు బాలయ్యకే సొంతం
‘హ్యాపీ బర్త్‌డే బాబాయ్’ – కల్యాణ్ రామ్
‘మా సింహం నందమూరి బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ – తమన్
‘బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ అభిరుచి, సమయపాలన సెట్‌లోని ప్రతి టెక్నీషియన్‌కు స్ఫూర్తినిస్తాయి. మీతో వర్క్ చేసే అవకాశం రావడం నా అదృష్టం. మీరు మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నాను’ – దర్శకుడు బాబీ
‘అన్‌స్టాపబుల్ ఫోర్స్ నందమూరి బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీతో వీరసింహారెడ్డి చేసిందుకు ఎంతో గర్విస్తున్నాను. మరో సినిమా తీయబోతున్నందుకు ఉత్సుకతతో ఉన్నాను’ – డైరెక్టర్ గోపీచంద్ మలినేని
‘తను లెజెండ్, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, కథానాయకుడు, అనసూయమ్మ గారి అల్లుడు, సమరసింహారెడ్డి, లక్ష్మీ నరసింహుడు, మా రచయితల కలానికి బలాన్ని అందిస్తూ అపూర్వమైన విజయాలను అందించిన పద్మభూషణుడు నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు’ – పరుచూరి గోపాలకృష్ణ.






