దేశంలో లింగనిష్పత్తి(Sex ratio), జనాబాకు సంబంధించిన వివరాలను భారత రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం విడుదల చేసింది. తాజా సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదిక (Civil Registration System Report) 2022, జనన గణాంకాలలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ప్రతి 1,000 పురుషుల జననాలకు స్త్రీ జననాల సంఖ్యగా చాలా రాష్ట్రాల్లో చాలా తక్కువగా ఉంది. ఈ మేరకు ప్రతి 1000 మంది పురుషులకు అమ్మాయిలు ఇలా ఉన్నారు.. బిహార్ 891తో అత్యల్ప SRB నమోదు చేయగా, తరువాత మహారాష్ట్ర (906), తెలంగాణ (907), హరియాణా (909), ఉత్తరాఖండ్ (910) ఉన్నాయి. ఇక APలో వెయ్యి మంది అబ్బాయిలకు 938 మంది అమ్మాయిలున్నారు.
స్వల్పంగా పెరిగిన శిశు మరణాలు
కాగా 2022లో నమోదైన జననాల ప్రకారం, నాగాలాండ్(Nagaland) అత్యధికంగా 1,068 SRB నమోదు చేయగా, అరుణాచల్ ప్రదేశ్ (1,036), లడఖ్ (1,027), మేఘాలయ (972), కేరళ (971) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు శిశు మరణాలు(Infant deaths) స్వల్పంగా పెరిగాయి. ఇది ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉండటం గమనార్హం. 2021లో 1.36 లక్షలుగా ఉన్న శిశు మరణాలు 2022లో స్వల్పంగా పెరిగి 1.43 లక్షలకు చేరుకున్నాయి. వీటిలో పట్టణ ప్రాంతాల్లో 81.5 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 18.5 శాతం మాత్రమే ఉన్నాయి.
Central govt report pegs Bihar’s sex ratio as India’s lowest in 2022, at just 891 girls for every 1,000 boys.
But if one were to believe the caste census, this ratio inexplicably improved to 953 girls per 1,000 boys in 2023.
A tale of two datasets: https://t.co/RCYXYRQ2Yp
— Jyoti Yadav (@jyotiyadaav) June 10, 2025






