
నితిన్ (Nithin) హీరోగా రూపొందించిన సినిమా ‘తమ్ముడు (Thammudu) ట్రైలర్వచ్చేసింది. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన సినిమాలో సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించగా.. సీనియర్నటి లయ కీలక పాత్ర పోషించారు. సినిమా జులై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ (Thammudu Trailer)ను చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది. నితిన్‌కు అక్కగా లయ నటించారు. అక్క ఇచ్చిన మాటను నిలబెట్టే తమ్ముడి కథతో ఈ సినిమా రూపొందినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. డైలాగ్స్, విజువల్స్, నేపథ్యం సంగీతం ఆకట్టుకుంటున్నాయి. ఆసక్తికరంగా ఉన్న ట్రైలర్‌ను మీరూ చూసేయండి.