త్రివిక్రమ్ శ్రీనివాస్- వెంకటేష్ క్రేజీ కాంబో ఫిక్స్.. కొత్త సినిమా వస్తోందిరోయ్

టాలీవుడ్‌ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas), అగ్రహీరో వెంకటేశ్‌(Venkatesh) కాంబినేషన్‌లో కొత్త సినిమా మొదలుకాబోతోంది. ఈ విషయాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ అధికారికంగా ప్రకటించారు. గురువారం ఆయన ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా ఈ సినిమా ప్రాజెక్ట్‌ను వెల్లడించారు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కనుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం షూటింగ్‌ జూలై లేదా ఆగస్టు నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వెంకటేశ్ సోలో హీరోగా నటించే చిత్రం ఇదే కావడం విశేషం. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత ఆయన సోలో హీరోగా నటించబోయే ప్రాజెక్ట్ ఇదే.

గతంలో వీరి కాంబినేషన్‌లో రూపొందిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మళ్ళి ఇప్పుడు ఈ కాంబినేషన్‌ లో రాబోయే సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం సినిమాకు సంబంధించి ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. మళ్లీ వెంకటేశ్-త్రివిక్రమ్ కలయిక వెండితెరపై మాయ చేయనుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు వెంకటేష్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ ఆడియన్స్ ని మెప్పించింది. తనదైన కామెడీ యాంగిల్స్ తో రెచ్చిపోయారు వెంకీ. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టింది. అదే జోష్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్నారు విక్టరీ వెంకటే

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *