తెలుగు ప్రేక్షకులను ఇటీవలే అలరించిన క్లీన్ హిట్ చిత్రాల్లో ‘శుభం'(Shubham ) ఒకటి. స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం, థియేటర్లలో మంచి స్పందనను అందుకుంది. సమంత(Samantha) ఇందులో కేమియో పాత్రలో కనిపించడం కూడా సినిమాకు ఆకర్షణగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కి వచ్చింది.
ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపుడి వంటి యువ నటీనటులు కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమాను జియో హాట్ స్టార్(Jio Hatstar ) వారు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో.. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ రోజు (13 జూన్) నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్సయిన వారు ఇప్పుడు ఓటీటీలో చూడవచ్చు.






