మంచి విష్ణు(Manchu Vishnu) హీరోగా తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీ కన్నప్ప(Kannappa). పలువురు స్టార్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), మోహన్‌లాల్ (Mohanlal), అక్షయ్ కుమార్ (Akshay Kumar) తదితర స్టార్ హీరోలు కీలక పాత్రలు పోషించారు. తిన్నడుగా విష్ణు, రుద్ర పాత్రలో ప్రభాస్, శివుడిగా అక్షయ్‌కుమార్ నటించారు. ‘మహాభారతం(Mahabharatam)’ సీరియల్ ఫేమ్ ముకేశ్ కుమార్‌సింగ్(Mukesh Kumar Singh) దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 27న (Kannappa Release Date) రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్(Trailer)ను మేకర్స్ విడుదల చేశారు.

‘దేవుడు లేడు’ అంటూ..
ఎన్ని రోజులుగా మూవీ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తికగా ఎదురుచూస్తున్న కన్నప్ప ట్రైలర్(Kannappa Trailer) వచ్చేసింది. 2 నిమిషాల 55 సెకన్లు గల ఈ వీడియోలో ‘దేవుడు లేడు’ అంటూ ప్రారంభమైన ఈ ట్రైలర్ అందరనీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ట్రైలర్‌లో చూపించిన ప్రభాస్, మంచు విష్ణు(Manchu Vishnu) మధ్య ఫైట్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని తెలుస్తోంది. ట్రైలర్ చూస్తుంటే విజువల్స్(Visuals), బ్యాగ్రౌండ్ మ్యూజిక్(Background music) మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ కన్నప్ప ట్రైలర్ చూసేయండి..






