10వ తరగతి కూడా పాస్ కాలేదు.. కానీ స్టార్ హీరొయిన్‌.. తెరపై కనిపిస్తే ఈలలే..

చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, పెద్దగా చదువు కోకపోయినా కూడా సెలబ్రిటీగా రాణించిన తారలు సినీ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఈమె ఒకరు. ఈ అమ్మడు పదవ తరగతి కూడా పాస్ కాలేకపోయినా, కెరీర్‌లో తనదైన మార్క్ వేసి, ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌లలో ఒకరిగా ఎదిగింది.

చదువు లేకపోయినా కష్టపడి, ప్రతిభతో టాప్ స్థాయికి చేరుకోవచ్చని నిరూపించింది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. నేటి తరం యువతకు ఓ రోల్ మోడల్. మరి ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా.. ఆమె ఎవరో కాదు కత్రినా కైఫ్.

మల్లీశ్వరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. వెంకటేష్(Venkatesh) సరసన నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. తర్వాత నందమూరి బాలకృష్ణ(Balakrishna)తో కలిసి అల్లరి పిడుగు సినిమాలో నటించి మెప్పించింది. అయితే తెలుగులో కేవలం రెండు సినిమాలలో నటించిన కూడా, కత్రినాకి తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించింది.

తెలుగులో హిట్ ఇచ్చిన తర్వాత, కత్రినా బాలీవుడ్ వైపు పయనమైంది. అక్కడ ఆమె ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరొయిన్‌గా ఎదిగింది. జబ్ తక్ హై జాన్, టైగర్ సిరీస్, జిందా హై, భారత్, జీరో, వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకుంది.

కత్రినా కైఫ్(Katrina Kaif) పదవ తరగతి కూడా పూర్తీ చేయలేదు. కానీ నటన, డెడికేషన్‌తో సినిమాల్లో స్థిరపడింది. ఓ ఇంటర్వ్యూలో తన చదువు గురించి ఆమె ఓపెన్‌గా వెల్లడించింది. చదువు అర్హత లేకపోయినా, కెరీర్‌లో సాధించిన విజయాలు ఆమెను స్టార్‌గా నిలిపాయి.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif)

ప్రస్తుతం కత్రినా ఒక్క సినిమాకు రూ. 20-25 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటుందట. ఆమె ఆస్తుల విలువ రూ. 200 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. సినిమాలు మాత్రమే కాదు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, బిజినెస్‌ల ద్వారా కూడా ఆమె భారీగా సంపాదిస్తోంది.

2021లో బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్‌ను కత్రినా కైఫ్ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా ఆమె సినిమాలపై ఫోకస్ కొనసాగిస్తోంది. సోషల్ మీడియాలోనూ కత్రినా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో రెగ్యులర్‌గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ కనెక్ట్ అవుతోంది.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *