ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్(Messaging app WhatsApp) కీలక మార్పులు తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ఈమేరకు తన సేవల సర్వీసులో ఇకపై ప్రకటనలు(Advertisements) తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనలు లేకుండా ఉచితంగా సేవలు అందిస్తున్న ఈ సంస్థ, ఇప్పుడు ఆదాయ మార్గాల(Income streams)పై దృష్టి సారించింది. ఇందులో భాగంగా, త్వరలోనే వాట్సాప్‌లో యాడ్స్ దర్శనమివ్వనున్నాయని సంస్థ తన అధికారిక బ్లాగ్ పోస్ట్(Blog post) ద్వారా వెల్లడించింది. యూజర్లు(Users) ఎక్కువగా ఉపయోగించే వాట్సాప్‌లోని ‘Updates’ ట్యాబ్‌లో ఈ ప్రకటనలు కనిపించనున్నాయి.
వ్యక్తిగత చాట్స్, కాల్స్‌కు మినహాయింపు
కాగా ప్రస్తుతం ఈ ట్యాబ్‌లో ఉన్న ఛానల్స్, స్టేటస్(Channels, Status) విభాగాల్లో వీటిని ప్రవేశపెట్టనున్నారు. వాట్సాప్ వెల్లడించిన వివరాల ప్రకారం, రోజూ సుమారు 150 కోట్ల మంది వినియోగదారులు ఈ అప్‌డేట్స్ ట్యాబ్‌ను చూస్తుంటారు. ఈ భారీ యూజర్ బేస్‌ను దృష్టిలో ఉంచుకుని, ఛానల్ అడ్మిన్లు, వివిధ సంస్థలు, వ్యాపారులకు తమ ఉత్పత్తులు, సేవలను ప్రచారం చేసుకునేందుకు, తద్వారా వాట్సాప్ ద్వారా ఎదిగేందుకు అవకాశం కల్పించాలనేది ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది. అయితే, ఈ ప్రకటనలు కేవలం అప్‌డేట్స్ ట్యాబ్‌కు మాత్రమే పరిమితమవుతాయని వాట్సాప్ స్పష్టం చేసింది. వ్యక్తిగత చాట్స్(Personal chats), కాల్స్(Calls), మెసేజ్‌లు(messages), వారు పెట్టుకునే స్టేటస్(Status)లు యథావిధిగా ఎలాంటి యాడ్స్ లేకుండా కొనసాగుతాయని క్లారిటీ ఇచ్చింది.
మూడు రకాల యాడ్ ఫీచర్లు ఉంటాయి..
వాట్సప్ ప్రధానంగా మూడు రకాల ప్రకటన సంబంధిత ఫీచర్లను తీసుకురానున్నట్లు తెలిపింది. ఛానల్ సబ్‌స్క్రిప్షన్(Channel Subscription) కింద వినియోగదారులు తమకు నచ్చిన ఛానళ్లకు నెలవారీ రుసుము చెల్లించి మద్దతు తెలిపే సౌకర్యం. రెండోది ప్రమోటెడ్ ఛానెల్ విభాగం(Promoted Channel Section)లో ట్రెండింగ్‌లో ఉన్న కొన్ని ఛానళ్లు కనిపిస్తుంటాయి. ఇకపై, ఛానల్ నిర్వాహకులు కొంత రుసుము చెల్లించి తమ ఛానల్ ఎక్కువ మందికి కనిపించేలా (Visibility) ప్రమోట్ చేసుకోవచ్చు. ఇక స్టేటస్ యాడ్స్‌లో ఇప్పటివరకు వ్యక్తుల స్టేటస్‌లు మాత్రమే కనిపించేవి. ఇకపై వ్యాపారాలకు సంబంధించిన స్టేటస్‌లు కూడా ఈ విభాగంలో దర్శనమిస్తాయి.
🚨 WhatsApp will be introducing ads and subscriptions in the coming months. (Meta)#WhatsApp #Subscription
WTF whatsapp Subscription 🤯😤
May be time coming to switch Into Tele or Insta or Mail Sooner for Documents sharing etc… pic.twitter.com/cCIyqXKhuE
— Mr.Professor (@EpicViralHub_) June 16, 2025






